ఐదు రోజుల్లో 500 బుకింగ్‌లను దక్కించుకున్న ఆడి క్యూ3

జర్మన్ లగ్జరీ కార్ మేకర్ ఆడి ఇండియా, తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త కాంపాక్ట్ ప్రీమియం ఎస్‌యూవీకి ఆడి క్యూ3కి మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఆడి క్యూ3 మార్కెట్లోకి విడుదలైన ఐదు రోజుల్లోనే 500 బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఆడి బ్రాండ్ పట్ల కొనుగోలుదారుల్లో ఉన్న క్రేజ్, ఈ మోడల్‌ విడుదలకు ముందు నుంచి జరుగుతున్న ప్రచారాలే ఇండియన్ మార్కెట్లో ఆడి క్యూ3 ఎస్‌యూవీ ఇంతటి ఘన విజయాన్ని సాధించేందుకు సహకరించాయి.

ఆడి క్యూ3 ఎస్‌యూవీని తొలిసారిగా, ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో ఆడి ఇండియా ఆవిష్కరించింది. అప్పటి నుండి ఆడి క్యూ3 కాంపారక్ట్ లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేయటానికి కస్టమర్లు వేయికళ్లతో ఎదురుచూశారు. దీంతో మార్కెట్లో విడుదలయిన కొద్ది రోజుల్లోనే ఆడి క్యూ3 ఎస్‌యూవీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది.


ఆడి క్యూ3 ఎస్‌యూవీ కోసం తొలి విడతలో భాగంగా 500 యూనిట్లకు మాత్రమే కంపెనీ బుకింగ్‌లను స్వీకరించింది. అయితే, ఈ మోడల్‌కు లభిస్తున్న విశేష స్పందను దృష్టిలో ఉంచుకొని రెండవ విడత బుకింగ్‌లను త్వరలోనే ప్రారంభించనుంది. జూన్ 2012 చివరి నాటికి మళ్లీ కేవలం 500 యూనిట్ల ఆడి క్యూ3 ఎస్‌యూవీల కోసం మాత్రమే బుకింగ్‌లను ప్రారంభించనున్నామని ఆడి ఇండియా పేర్కొంది.

ఆడి క్యూ3 వాల్ పేపర్స్:

ఆడి క్యూ3 ఎస్‌యూవీలో శక్తివంతమైన, మెరుగైన మైలేజ్‌నిచ్చే 2.0 టిడిఐ క్వాట్రో ఇంజన్‌‌ను అమర్చారు. రాష్ట్ర మార్కెట్లో దీని ధరలు రూ.28,80,500 నుంచి రూ.34,29,500 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) రేంజ్‌లో ఉన్నాయి. ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా ఉన్న 19 డీలర్ల ద్వారా ఆడి క్యూ3 లభ్యం కానుంది. ఆడి క్యూ3చో పాటుగా ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 15, 2012, 11:06 [IST]
English summary
Audi, the German luxury car manufacturer, today announced that it has completed the first round of bookings of Audi Q3 for the initial phase, in which 500 SUVs were made available. This is probably a new record in this category with Audi completing bookings for all 500 Audi Q3’s in just five days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+