పోటీదారులకు చెక్ పెట్టేందుకు ఆడి ఇండియా మాస్టర్ ప్లాన్స్

Audi Q3 2012
బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ కంపెనీల నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా, మహారాష్ట్రలో ఓ కొత్త అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఆడి నుండి అత్యంత విజయవంతమైన క్యూ7, క్యూ3 ఎస్‌యూవీలను ఔరంగాబాద్‌ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయాలని భావిస్తున్నామని, ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 8,000 యూనిట్లకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 2012లో తమ వృద్ధికి, క్యూ3 ఎస్‌యూవీ అత్యంత కీలకమైన ఉత్పత్తి అని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.

మరికొద్ది సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఓ సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన చెప్పారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఆడి క్యూ3 ఎస్‌యూవీ ధర రూ.25-30 లక్షల మధ్యలో ఉండనుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీ, మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్ బెంజ్ బి క్లాస్ వంటికార్లకు ఇది పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 3, 2012, 15:30 [IST]
English summary
Audi, the German premium carmaker has said it will be launching seven new models in India in the year 2012. This announcement is aimed at pushing Audi's sales further up against competitors such as BMW and Mercedes-Benz. Audi India has set itself a target of becoming India's second highest selling premium car brand by 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+