వైఖరి మార్చుకోకుంటే రాష్ట్రం వదలిపోతాం: ఆటో కంపెనీలు

జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్, దేశీయ ఆటో దిగ్గజాలు మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో కంపెనీలు మహారాష్ట్ర సర్కారుపై గుర్రుగా ఉన్నాయి. సేల్స్ టాక్స్ (అమ్మకపు పన్ను) విషయంలో ఆ రాష్ట్రం ప్రవర్తిస్తున్న వైఖరి పట్ల ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా, మహారాష్ట్ర సర్కారు తమ వైఖరిని మార్చుకోనట్లయితే, భవిష్యత్తులో కొత్త పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టమని హెచ్చరిస్తున్నాయి.

గతంలో ఈ విషయంపై ఫోక్స్‌వ్యాగన్ ఇండియా స్పందిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమైతేనే రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికల గురించి ఆలోచిస్తామని తెలుపగా, బజాజ్ ఆటో లిమిటెడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మాహారాష్ట్రలో కొత్త పెట్టుబడులు పెట్టే అంశంపై పునరాలోచనలో పడింది.

మహీంద్రా, బజాజ్, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలకు పూనేలోని ఛాకన్‌లో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఒక్క మహీంద్రా కంపెనీ కొత్త పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లుయతే మహారాష్ట్ర రూ.4,000 కోట్ల పెట్టుబడులను కోల్పోతుంది. ఈ అంశపై కంపెనీ అధ్యక్షుడు పవన్ గోయెంకా మాట్లాడుతూ.. ఇది సౌకర్యవంతమైన పరిస్థితి కాదని, తర్వాతి దశ విస్తరణ కోసం తాము ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రను వదిలిపెట్టి వెళ్లాలని భావిస్తున్నామని అన్నారు.

ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, దీనికి పరిష్కారాన్ని కనుగొంటామని వారు తెలిపారని ఆయన చెప్పారు. ఏదేమైనప్పటికీ, దీని కోసం తాము ఎక్కువ సమయం వేచి ఉండలేమని, రానున్న నెల రోజుల్లోపుగా కొత్త పెట్టుబడులపై ఓ నిర్ణయం తీసుకుంటామని గోయెంకా చెప్పారు. కొత్త పెట్టుబడులను ఇతర రాష్ట్రాల్లో వెచ్చించేందుకు గానూ కంపెనీ సదరు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 22, 2012, 12:58 [IST]
English summary
Dr Pawan Goenka, Automotive and Farm Equipment, President, said: "It is not a comfortable situation and we are actively considering moving out from Maharashtra as we plan the next phase of expansion. We had taken up the matter with the Maharashtra government and they said they are finding a solution. However, we cannot wait for long and may take a decision on new investments over the next one month."
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+