కూతురు ఆరాధ్య కోసం ఆడి ఏ8ను బుక్ చేసిన అభిషేక్ బచ్చన్

ఈ నేపథ్యంలో ఆరాధ్యకు పేరు పెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని అభిషేకే ఆడి ఏ8 (ఈ కారు పేరు కూడా ఏ అనే అక్షరంతోనే ప్రారంభమవుతుంది) కారును బుక్ చేశారు. ఈ కారులో మొదటిగా ఆరాధ్యనే ప్రయాణించనుంది. ఆరాధ్యను హాస్పత్రి నుండి ఇంటికి ఈ కారులోనే తీసుకువెళ్లనున్నారట.
ఇకపోతే ఆడి ఏ8 కారు విషయానికి వస్తే, జర్మనీ లగ్జరీ కార్ మేకర్ అందిస్తున్న ఈ ప్రీమియం కారు పూర్తిగా విలాసవంతమైన ఫీచర్లతో రూపొందించబడిన శక్తివంతమైన కారు ఇది. భారత్‌లో దీని ధర సుమారు ఒక కోటి రూపాయల వరకూ ఉండొచ్చని అంచనా. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఆడి ఏ8 కారు 4.2 లీటర్ ఎఫ్ఎస్ఐ క్వట్టారో ఇంజన్‌తోనూ, డీజిల్ వేరియంట్ ఆడి ఏ8 3.0 లీటర్ టిడిఐ ఇంజన్‌తోనూ లభిస్తుంది. మరి బచ్చన్ ఫ్యామిలీనా మాజాకా..!!


Click it and Unblock the Notifications








