మందగించిన బజాజ్ బైక్ సేల్స్, జోరు మీదున్న మహీంద్రా స్కూటర్స్
ఆగస్టు 2011 నెలతో పోల్చుకుంటే ఆగస్టు 2012 నెలలో బజాజ్ మోటార్‌సైకిళ్ల వహనాలు 9.97 శాతం క్షీణించి 3,38,054 యూనిట్ల నుంచి 3,04,352 యూనిట్లకు పడిపోయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు కూడా 4.82 శాతం క్షీణించి 138,225 యూనిట్ల నుంచి 131,562 యూనిట్లకు పడిపోయాయి.
త్రిచక్ర వాహనాల విభాగంలో కూడా అమ్మకాలు 9 శాతం తగ్గి 44,685 యూనిట్ల నుంచి 40,554 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు సుమారు 10 శాతం తగ్గి 3,44,906 యూనిట్లుగా నమోదయ్యాయి.
మహీంద్రా స్కూటర్ల జోరు:
మహీంద్రా టూ వీలర్స్ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన మహీంద్రా డ్యూరో డిజెడ్, మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ స్కూటర్లకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. గడచిన ఆగస్టులో కంపెనీ మొత్తం 10,028 స్కూటర్లను విక్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ కంపెనీ మొత్తం 50,567 స్కూటర్లను విక్రయించామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications









