బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను చూసి అవాక్కయిన రీనాల్ట్-నిస్సాన్

ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు తయారు చేయటంలో పేరుగాంచిన బజాజ్ ఆటో లిమిటెడ్ తొలిసారిగా రూపొందించిన ఫోర్-వీలర్ 'ఆర్ఈ60'ను మార్కెటింగ్ చేసే విషయంలో రీనాల్ట్-నిస్సాన్ కంపెనీలు చేతులెత్తేసేలా ఉన్నాయి. ఇప్పటికే, ఈ మోడల్‌ను చూసిన రీనాల్ట్-నిస్సాన్ అధికారులు దీని డిజైన్, పెర్ఫామెన్స్‌లపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

బజాజ్ ఆర్ఈ60 ఫోర్ వీలర్ గురించి రీనాల్ట్-నిస్సాన్ సీఈఓ కార్లోస్ ఘోస్న్ మాట్లాడుతూ.. ఈ కారును అమ్మాలా వద్దా అనే విషయంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని, తమ ప్రతినిధులు ఈ కారును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, నిర్ణయానికి సంబంధిం ఎటువంటి టైమ్ ఫ్రేమ్‌ను తాము ఇప్పట్లో చెప్పలేమని అన్నారు. మొదటి సారిగా కారును కొనాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకొని, తక్కువ ధరలో ఓ వాహనాన్ని అందించాలనుకున్నామని, అది కారులా ఉండాలని ఆయన అన్నారు.

బజాజ్ ఆటో అభివృద్ధి చేసిన ఆర్ఈ60 ఉత్పత్తి విషయంలో తాము తలదూర్చబోమని, కేవలం సేల్స్, మార్కెటింగ్ వరకూ మాత్రమే తమను తాము నియంత్రించుకుంటామని అన్నారు. అంతేకాకుండా.. తమ స్వంత కార్లతో పాటుగా విక్రయించాలనుకుంటున్న చౌక ధర వాహనం ఇది (బజాజ్ ఆర్ఈ60) కాదని కార్లోస్ ఘోస్న్ స్పష్టం చేశారు. కార్లోస్ ఘోస్న్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బజాజ్ ఆర్ఈ60 ప్రాజెక్ట్‌పై రీనాల్ట్-నిస్సాన్ కంపెనీలు పూర్తిగా చేతులు ఎత్తేసేలా ఉన్నాయి.

ఇక బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్ విషయానికి వస్తే.. లీటర్ పెట్రోల్‌కు 35 కి.మీ. మైలేజీనిచ్చే విధంగా, ఇందులో 200సీసీ డిటిఎస్-ఐ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్లు వేగంతో పరుగులు పెడుతుంగి. దీనిని కారు అనడం కన్నా పర్సనలైజ్డ్ ఆటో అని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాంప్రదాయ త్రికచ్ర వాహనాల (ఆటోరిక్షాలు) స్థానాన్ని ఇది భర్తీ చేయడానికి మాత్రమే ఇది సరిపోతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 10, 2012, 12:58 [IST]
English summary
Renault-Nissan might not approve the Bajaj RE60 four wheeler as their ultra low cost (ULC) car. "We have not taken a decision yet whether we would like to sell the car or not. Our executives are looking at the product closely and I cannot give you a time frame (when) we would be ready with a decision. This vehicle is intended to be a low-cost model for people driving a car for the first time. We are not looking at conformity but it has to be a car" Renault-Nissan CEO Carlos Ghosn said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+