టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్

By Ravi

గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో ఆవిష్కరించిన మినీ ఫోర్-వీలర్ 'బజాజ్ ఆర్ఈ60' త్వరలోనే భారత రోడ్లపై పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని గత మే నెలలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. "ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆర్ఈ60 వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది, అదే సమయానికి దీనిని మార్కెట్లోకి విడుదల చేయడం కూడా జరుగుతుంద"ని బజాజ్ ఆటో లిమిటెడ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) ఎస్ రవికుమార్ ఇది వరకే ఓ సందర్భంలో వెల్లడించారు.

కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను ఇప్పటికే ఇండియన్ రోడ్లపై టెస్ట్ రన్ కూడా నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి నిస్సాన్-రెనో కంపెనీలు తప్పుకుంటున్నప్పటికీ, ఈ వాహనానికి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉండగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఇదిగో ఇందుకు సాక్ష్యమే ఈ క్రింది ఫోటోలు. బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను పూనే రోడ్లపై టెస్ట్ చేస్తుండగా కెమెరా కంటికి చిక్కినవి. పూనేలో బజాజ్ ప్లాంటులో ఈ ఫోర్-వీలర్ ఉత్పత్తి కానుంది.

బజాజ్ ఆర్ఈ60 - ఇంజన్

బజాజ్ ఆర్ఈ60 - ఇంజన్

బజాజ్ ఆర్ఈ60 ఫోర్ వీలర్‌లో 200సీసీ డిటిఎస్-ఐ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను అమర్చారు. టాటా నానో మాదిరిగానే ఆర్ఈ60 ఇంజన్ కూడా వెనకభాగంలోనే ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్లు వేగంతో పరుగులు తీస్తుంది.

బజాజ్ ఆర్ఈ60 - మైలేజ్

బజాజ్ ఆర్ఈ60 - మైలేజ్

బజాజ్ ఆర్ఈ60 లీటర్ పెట్రోల్‌కు 35 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ ఫోర్ వీలర్‌ను తొలుతగా పొరుగు దేశమైన శ్రీలంకకు ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది.

బజాజ్ ఆర్ఈ60 - 2012 ఆటో ఎక్స్‌పో

బజాజ్ ఆర్ఈ60 - 2012 ఆటో ఎక్స్‌పో

గడచిన జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ప్రదర్శన సమయంలో బజాజ్ ఆటో తొలిసారిగా ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను ప్రజలకు పరిచయం చేసింది.

బజాజ్ ఆర్ఈ60 - డెవలప్‌మెంట్

బజాజ్ ఆర్ఈ60 - డెవలప్‌మెంట్

బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను అభివృద్ధి చేయడానికి బజాజ్ ఆటోకు నాలుగు సంవత్సరాల సమయం పట్టింది.

బజాజ్ ఆర్ఈ60 - ఫీచర్లు

బజాజ్ ఆర్ఈ60 - ఫీచర్లు

* 200సీసీ పెట్రోల్ ఇంజన్

* సిటీ ట్రాఫిక్‌లకు, రోడ్లకు చక్కగా సరిపోతుంది.

* గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.

* ప్రకృతి సాన్నిహిత్యమైనది (ఎకో-ఫ్రెండ్లీ)

* ఫోర్ సీటర్ (నలుగురు ప్రయాణికులు సులువుగా ప్రయాణించవచ్చు)

బజాజ్ ఆర్ఈ60 - కొలతలు

బజాజ్ ఆర్ఈ60 - కొలతలు

* బజాజ్ ఆర్ఈ60 పొడవు x వెడల్పు x ఎత్తు : 2752 మి.మీ. x 1312 మి.మీ. x 1650 మి.మీ.

* బజాజ్ ఆర్ఈ60 మొత్తం బరువు: 400 కేజీలు

* కనీస టర్నింగ్ రేడియస్ - 3.5 మీటర్లు

* లగేజ్ (బూట్) స్పేస్ - 44 లీటర్లు

బజాజ్ ఆర్ఈ60 - ధర

బజాజ్ ఆర్ఈ60 - ధర

బజాజ్ ఆర్ఈ60 అంచనా ధర - రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్).


ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాంప్రదాయ ఆటోరిక్షాలకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా బజాజ్ ఆర్ఈ60 మార్కెట్లో సందడి చేసే అవకాశం ఉంది. అయితే, ఇది కేవలం కమర్షియల్ ప్రయోజనం కోసమే మార్కెట్లో లభిస్తుందా లేక పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయోజనం కోసం కూడా లభిస్తుందా అనేది తేలాల్సి ఉంది. గతంలో బజాజ్ ఆటో స్పష్టం చేసిన దాని ప్రకారం, ఆర్ఈ60 తమ ఆల్ట్రా లో-కాస్ట్ కారు మాత్రం కాదని, ఇది కేవలం ఫోర్ వీలర్ మాత్రమేనని పేర్కొంది.

బజాజ్ ఆర్ఈ60 ఫోటో గ్యాలరీ

బజాజ్ ఆల్ట్రా లో-కాస్ట్ కారు ప్రాజెక్ట్ కోసం నిస్సాన్, రెనో, బజాజ్ మూడు కంపెనీల 2009లో ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, బజాజ్ ఆటో ఓ చిన్న కారు తయారు చేసి ఇస్తే, నిస్సాన్-రెనో కంపెనీలు భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లలో ఈ కారును మార్కెటింగ్ చేస్తాయి. అయితే, బజాజ్ తయారు చేసే ఈ చిన్న కారు నిస్సాన్-రెనో కంపెనీల నాణ్యత ప్రమాణాలను పాటించేలా ఉండాలి. ఈ ప్రాజెక్టులో భాగంగా, బజాజ్ ఆటో ఓ కాన్సెప్ట్ కారును రూపొందించింది. అయితే, ఈ కారును నిస్సాన్-రెనో కంపెనీలు ప్రదర్శించలేదు.

ఈ ఆల్ట్రా లోకాస్ట్ కారుకు బదులు కంపెనీ అభివృద్ధి చేసిన 'ఆర్ఈ60' కాన్సెప్ట్‌ను బజాజ్ ప్రదర్శనకు ఉంచింది. ఈ ఫోర్-వీలర్‌ను చూసి అసంతృప్తి చెందిన రెనో, నిస్సాన్ కంపెనీలు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించాయి.
Spy Images Source: Anything On Wheels

More from DriveSpark

Article Published On: Tuesday, October 23, 2012, 10:08 [IST]
English summary
The launch of the Bajaj RE60 has been a topic of suspense since its unveiling at the Delhi Auto Expo this January. But the latest buzz is that, the company is planning to launch this four wheeler by end of this fiscal. Bajaj Auto is already testing RE60 on Indian roads. Here are the few spy shots from Anything On Wheels blog.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+