మార్చి నెలలో 10 శాతం పెరిగిన బజాజ్ ఆటో బైక్ సేల్స్

పల్సర్, డిస్కవర్ బ్రాండ్ అండదండలతో బజాజ్ ఆటో గడచిన నెలలో కూడా ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. మార్చి 2012లో బజాజ్ ఆటో అమ్మకాలు 3,00,848 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 10 శాతం అధికం. మార్చి 2011లో 2,74,392 యూనిట్ల వాహనాలను విక్రయించామని బజాజ్ ఆటో ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇకపోతే మార్చి 2012లో బజాజ్ ఆటో ఎగుమతులు 54 శాతం వృద్ధి చెంది 1,07,691 యూనిట్లుగా నమోదు కాగా, గడచిన సంవత్సరం ఇదే సమయంలో ఇవి 69,884 యూనిట్లుగా ఉన్నాయి. ఇక త్రిచక్ర వాహనాల విషయానికి వస్తే వీటి అమ్మకాలు 4 శాతం వృద్ధి చెందిన 33,349 యూనిట్ల నుండి 34,667 యూనిట్లకు పెరిగాయి.

మొత్తమ్మీద మార్చి 2012లో బజాజ్ ఆటో మొత్తం వాహనాల విక్రయాలు 9 శాతం వృద్ధి చెంది 3,35,515 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్చి 2011లో ఈ సంఖ్య 3,07,741 యూనిట్లుగా ఉంది. మార్చి 31, 2012తో ముగిసిన 2011-12 త్రైమాసికంలో బజాజ్ ఆటో మొత్తం 38,34,405 మోటార్‌‌సైకిళ్ల విక్రయించి 13 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. అలాగే, త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో కూడా బజాజ్ ఆటో 2011-12లో ఆర్థిక సంవత్సరంలో 31 శాతం వృద్ధి కనబరిచి 15,79,824 యూనిట్లను విక్రయించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 4, 2012, 13:22 [IST]
English summary
The country's second largest two-wheeler maker Bajaj Auto (BAL) today reported 10% increase in motorcycle sales in March at 300,848 units, the highest ever for the month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+