ఇంపోర్టెడ్ కార్‌వ్యాన్‌లను ఇండియాలో ప్రవేశపెట్టిన బేస్‌క్యాంప్

ముంబైకు చెందిన అడ్వెంచర్ ట్రావెల్ యాక్ససరీస్ తయారీ కంపెనీ 'బేస్‌క్యాంప్' ఇండియాలో రెండు ఇంపోర్టెడ్ 'కార్‌వ్యాన్'లను విడుదల చేసింది. హైమర్ స్పోర్టింగ్ స్టయిల్ 465, డెత్లెఫ్స్ న్యూలైన్ 410టికె అనే రెండు కార్‌వ్యాన్‌లను బేస్‌క్యాంప్ ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కార్‌వ్యాన్‌లను ఇండియాలో అందించేందుకు గాను బేస్‌క్యాంప్ జర్మనీకు చెందిన హైమర్, డెత్లెఫ్స్ సంస్థలతో చేతులు కలిపింది. వీటిని నేరుగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు. భారత మార్కెట్లో ఈ రెండు మోడళ్ల కార్ వ్యాన్ ధరలు ఇలా ఉన్నాయి.

  • బేస్‌క్యాంప్ హైమర్ స్పోర్టింగ్ స్టయిల్ 465 - రూ. 22 లక్షలు (పన్నులు అధనం)
  • బేస్‌క్యాంప్ డెత్లెఫ్స్ న్యూలైన్ 410టికె - రూ. 16 లక్షలు (పన్నులు అధనం)

(ఈ కార్‌వ్యాన్‌ల స్టిక్కర్ ధరపై అధనంగా 40 శాతం దిగుమతి సుంఖం ఉంటుంది)

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - ధర

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - ధర

ముంబైకు చెందిన అడ్వెంచర్ ట్రావెల్ యాక్ససరీస్ తయారీ కంపెనీ 'బేస్‌క్యాంప్' ఇండియాలో హైమర్ స్పోర్టింగ్ స్టయిల్ 465, డెత్లెఫ్స్ న్యూలైన్ 410టికె అనే రెండు ఇంపోర్టెడ్ 'కార్‌వ్యాన్'లను విడుదల చేసింది. భారత మార్కెట్లో వీటి ధరలు వరుసుగా రూ. 22 లక్షలు, రూ. 16 లక్షలుగా ఉన్నాయి.

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - ఫీచర్లు

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - ఫీచర్లు

కార్‌వ్యాన్‌లో హాయిగా నిద్రించడానికి పడకలు, స్నానం చేయటానికి బాత్‌రూమ్‌లు, వంట చేసుకోవటానికి వంటగది సౌకర్యాలు, శీతల పానీయాలు సేవించడానికి ఫ్రిడ్జ్, భోజనం చేయటానికి డైనింగ్ ఏరియా, వస్తువులు భద్రపరచుకోవటానికి అల్మారాలు, లోపలి వాతావరణాన్ని చల్లగా ఉంచే ఎయిర్‌కండిషనింగ్, బోర్ కొడితే వినోదం పంచడానికి టెలివిజన్, మ్యూజిక్ సిస్టమ్ మొదలైన అన్ని హై-ఫై సౌకర్యాలు ఈ కార్‌వ్యాన్‌లలో ఉంటాయి.

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - విద్యుత్

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - విద్యుత్

కార్‌వ్యాన్‌లకు ఇంటికి ఉపయోగించే విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చు (220 వోల్ట్ పవర్ సాకెట్ ద్వారా) లేదా పోర్టబల్ జనరేటర్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ జనరేటర్‌ను కార్‌వ్యాన్‌లోనే అమర్చబడి ఉంటుంది.

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - మోడల్స్

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - మోడల్స్

డెత్లెఫ్స్ న్యూలైన్ 410టికె కార్‌వ్యాన్ కన్నా హైమర్ స్పోర్టింగ్ స్టయిల్ 465 కొంచెం పెద్దది. ఇది డబల్ బెడ్‌తో లభిస్తుంది. దీని వాష్‌రూమ్ కూడా మరింత విశాలంగా ఉంటుంది. హైమర్ యూరప్‌లో అతిపెద్ద కార్‌వ్యాన్, మోటార్‌హోమ్‌ల తయారీ కంపెనీ కాగా, డెత్లెఫ్స్ యూరప్‌తో అతిపెద్ద కార్‌వ్యాన్ ప్రొవైడర్‌గా ఉన్నాయి.

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - డెలివరీ

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌ - డెలివరీ

కార్‌వ్యాన్‌లను ఆర్డర్ చేసిన 45-90 రోజుల లోపుగా డెలివరీ చేస్తామని కంపెనీ పేర్కొంది. కార్‌వ్యాన్‌లను ప్రమోట్ చేసేందుకు గాను భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హర్యానా టూరిజం కార్పోరేషన్‌లతో బేస్‌క్యాంప్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌లకు బిపిసిఎల్ తమ పెట్రోల్ బంకుల వద్ద, హర్యానా టూరిజం తమ యాత్రి నివాస్ కాంపౌండ్ల వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నాయి.

బేస్‌క్యాంప్ రూఫ్ టెంట్‌ - ధర

బేస్‌క్యాంప్ రూఫ్ టెంట్‌ - ధర

బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌లను మాత్రమే కాకుండా రూఫ్ టెంట్‌లను కూడా ఆఫర్ చేస్తుంది. ఎస్‌యూవీలపై ఉండే రూఫ్ రెయిల్స్‌పై ఈ టెంట్‌లను అమర్చుకోవచ్చు. ప్రయాణ సమయంలో విరామం కోరుకున్నప్పుడు ఈ రూఫ్ టెంట్‌లలో ఇద్దరు ప్రయాణికులు హాయిహా నిద్రపోవచ్చు. ఆటోహోమ్‌ కంపెనీ నుంచి లభ్యం కానున్న ఈ కొలంబస్ బ్రాండ్ రూఫ్ రెంట్ ధర బేస్‌క్యాంప్ స్టోర్‌లో రూ.1.25 లక్షలుగా ఉంది.

బేస్‌క్యాంప్ - ఇంటర్నేషనల్ బ్రాండ్స్

బేస్‌క్యాంప్ - ఇంటర్నేషనల్ బ్రాండ్స్

బేస్‌క్యాంప్ దేశీయ విపణిలో విక్టోరినాక్స్, గో ట్రావెల్, మ్యాగ్‌లైట్, మెలా నైవ్స్, అవుట్‌సైడర్, కటడిన్, ట్రిమ్, లాకెన్, గోర్ల్, ఆప్టిమస్, వెన్జర్ గేర్ వంటి అనేక రకాల అంతర్జాతీయ బ్రాండ్‌లను విక్రయిస్తుంది.

కార్‌వ్యాన్ - కంఫర్ట్

కార్‌వ్యాన్ - కంఫర్ట్

తరచూ దూర ప్రయాణాలు చేసేవారు, పర్యాటక ప్రదేశాలు సందర్శించేవారు, అడ్వెంచర్ రైడ్‌లను చేసేవారికి ఈ కార్‌వ్యాన్‌లో ఓ చక్కటి ప్రయాణ అనుభూతిని మిగుల్చుతాయి. కార్‌వ్యాన్‌లను ఉపయోగించడం వలన హోటళ్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే విలాసవంతమైన సౌకర్యాలను పొందవచ్చు.


కార్‌వ్యా‌న్ అంటే ఏమిటి..?
కార్‌వ్యాన్ గురించి సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, ఇదొక కదిలే ఇల్లు లాంటిది. మీ స్వంత వాహనానికి వెనుక భాగంలో ఈ కార్‌‌వ్యాన్‌ను తగిలించుకొని మీరు ఎక్కిడికి వెళ్లితే అక్కడికి దీనిని తీసుకువెళ్లవచ్చు. కార్‌వ్యాన్‌లలో మోటార్‌హోమ్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇందులో హాయిగా నిద్రించడానికి పడకలు, స్నానం చేయటానికి బాత్‌రూమ్‌లు, వంట చేసుకోవటానికి వంటగది సౌకర్యాలు, శీతల పానీయాలు సేవించడానికి ఫ్రిడ్జ్, భోజనం చేయటానికి డైనింగ్ ఏరియా, వస్తువులు భద్రపరచుకోవటానికి అల్మారాలు, లోపలి వాతావరణాన్ని చల్లగా ఉంచే ఎయిర్‌కండిషనింగ్, బోర్ కొడితే వినోదం పంచడానికి టెలివిజన్, మ్యూజిక్ సిస్టమ్ మొదలైన అన్ని హై-ఫై సౌకర్యాలు ఈ కార్‌వ్యాన్‌లలో ఉంటాయి.

మరి ఈ కార్‌వ్యాన్‌లకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందనే కదా మీ సందేహం..? ఈ కార్‌వ్యాన్‌లకు ఇంటికి ఉపయోగించే విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చు (220 వోల్ట్ పవర్ సాకెట్ ద్వారా) లేదా పోర్టబల్ జనరేటర్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ జనరేటర్‌ను కార్‌వ్యాన్‌లోనే అమర్చబడి ఉంటుంది. ఇందులో రెండు వంట గ్యాస్ సిలిండర్లను భద్రపరచుకునేందు స్థలం కూడా ఉంటుంది. డెత్లెఫ్స్ న్యూలైన్ 410టికె కార్‌వ్యాన్ కన్నా హైమర్ స్పోర్టింగ్ స్టయిల్ 465 కొంచెం పెద్దది. ఇది డబల్ బెడ్‌తో లభిస్తుంది. దీని వాష్‌రూమ్ కూడా మరింత విశాలంగా ఉంటుంది.

హైమర్ యూరప్‌లో అతిపెద్ద కార్‌వ్యాన్, మోటార్‌హోమ్‌ల తయారీ కంపెనీ కాగా, డెత్లెఫ్స్ యూరప్‌తో అతిపెద్ద కార్‌వ్యాన్ ప్రొవైడర్‌గా ఉన్నాయి. ఈ సంస్థకు దేశవ్యప్తంగా 15 స్టోర్లు ఉన్నాయి. వచ్చే సంవత్సరంలో 600 కార్‌వ్యాన్‌లను విక్రయించాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. రానున్న రోజుల్లో తొలుత ఈ కార్‌వ్యాన్‌లను ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తామని, అనంతరం వాటిని పూర్తిగా ఇక్కడే తయారు చేస్తామని, అప్పుడు మరింత తక్కువ ధరకే వీటిని అందించే అవకాశం కలుగుతుందని బేస్‌క్యాంప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిష్ గోయెల్ తెలిపారు.

ప్రస్తుతం ఆర్డర్ చేసిన 45-90 రోజుల లోపుగా కార్‌వ్యాన్‌లను డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు. కార్‌వ్యాన్‌లను ప్రమోట్ చేసేందుకు గాను భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హర్యానా టూరిజం కార్పోరేషన్‌లతో బేస్‌క్యాంప్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌లకు బిపిసిఎల్ తమ పెట్రోల్ బంకుల వద్ద, హర్యానా టూరిజం తమ యాత్రి నివాస్ కాంపౌండ్ల వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నాయి.

బేస్‌క్యాంప్ రూఫ్ టెంట్‌:
బేస్‌క్యాంప్ కార్‌వ్యాన్‌లను మాత్రమే కాకుండా రూఫ్ టెంట్‌లను కూడా ఆఫర్ చేస్తుంది. ఎస్‌యూవీలపై ఉండే రూఫ్ రెయిల్స్‌పై ఈ టెంట్‌లను అమర్చుకోవచ్చు. ప్రయాణ సమయంలో విరామం కోరుకున్నప్పుడు ఈ రూఫ్ టెంట్‌లలో ఇద్దరు ప్రయాణికులు హాయిహా నిద్రపోవచ్చు. ఆటోహోమ్‌ కంపెనీ నుంచి లభ్యం కానున్న ఈ కొలంబస్ బ్రాండ్ రూఫ్ రెంట్ ధర బేస్‌క్యాంప్ స్టోర్‌లో రూ.1.25 లక్షలుగా ఉంది.

బేస్‌క్యాంప్ దేశీయ విపణిలో విక్టోరినాక్స్, గో ట్రావెల్, మ్యాగ్‌లైట్, మెలా నైవ్స్, అవుట్‌సైడర్, కటడిన్, ట్రిమ్, లాకెన్, గోర్ల్, ఆప్టిమస్, వెన్జర్ గేర్ వంటి అనేక రకాల అంతర్జాతీయ బ్రాండ్‌లను విక్రయిస్తుంది. తరచూ దూర ప్రయాణాలు చేసేవారు, పర్యాటక ప్రదేశాలు సందర్శించేవారు, అడ్వెంచర్ రైడ్‌లను చేసేవారికి ఈ కార్‌వ్యాన్‌లో ఓ చక్కటి ప్రయాణ అనుభూతిని మిగుల్చుతాయి. కార్‌వ్యాన్‌లను ఉపయోగించడం వలన హోటళ్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే విలాసవంతమైన సౌకర్యాలను పొందవచ్చు.

Article Published On: Saturday, October 20, 2012, 13:20 [IST]
English summary
Mumbai based adventure travel accessories company Basecamp has launched the Hymer Sporting Style 465 and Dethleffs Newline 410tk caravans, priced at Rs 22 lakh and Rs 16 lakh respectively (both price are excluding taxes).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+