మహిళల కోసం మారుతి డ్రైవింగ్ స్కూల్ వినూత్న కాంటెస్ట్
కాంటెస్ట్‌కు అర్హత:
* 18 ఏళ్లు అంతకు మించి వయస్సు కలిగి ఉండి, చెల్లుబాటు కలిగిన డ్రైవింగ్ లైసెన్స్, కార్పోరేట్ ఐడిలను కలిగి ఉన్న మహిళలు.
* కార్పోరేట్ ఉద్యోగస్తులు భార్యలు కూడా అర్హులు.
కాంటెస్ట్ వివరాలు:
* విజేత ఎంపికను ఆన్‌లైన్ క్విజ్ ఫలితాలు, మారుతి డ్రైవింగ్ స్కూల్‌లో ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ ద్వారా చేయబడుతుంది.
* ఈ ఆన్‌లైన్ క్విజ్ మార్చి 8 నుండి 22 వరకూ ఓపెన్ చేయబడి ఉంటుంది. మారుతి డ్రైవింగ్ స్కూల్‌లో ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్‌లు మార్చి 12 నుండి 31 వరకూ నిర్వహించబడుతాయి.
* ఒక్కొక జోన్ (నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్)కు ఒక్క విజేతను ప్రకటించడం జరుగుతుంది. "క్వీన్ ఆఫ్ ది రోడ్" టైటిల్‌ను గెలుచుకున్న విజేతకు రూ.50,000 విలువైన బహుమతి.
* ఏప్రిల్ 2012 మొదటి వారంలో విజేతల వివరాలను ప్రకటించడం జరుగుతుంది.
* ఢిల్లీ ఎన్‌సిఆర్, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, ఇండోర్, లక్నో, పూనే, బెంగుళూరు, కోల్‌కటా నగరాల్లో ఈ కాంటెస్ట్ నిర్వహించబడుతుంది.
ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం సేఫ్ ఉమెన్ డ్రైవర్ కాంటెస్ట్ డాట్‌కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications









