మారుతి ఎర్టిగా: క్లాస్, మైలేజ్, పవర్, ప్రైస్‌లో ది బెస్ట్!
ఎర్టిగా ఎమ్‌పివి విషయానికి వస్తే.. 2010లో జరగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తొలిసారిగా ఓ ఎమ్‌పివి కాన్సెప్ట్ పరిచయం చేసింది. అనంతరం దీనికి ఎర్టిగా అనే పేరును ఖరారు చేసిన ఇటీవల జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రొడక్షన్ వెర్షన్‌ను ఆవిష్కరిచింది. ఏడుగురు ప్రయాణికులు కూర్చుని హాయిగా ప్రయాణించేలా రూపొందించిన ఈ ఎమ్‌పివిలో శక్తివంతమైన మరియు తేలికైన నెక్స్ట్ జనరేషన్ కె-సిరీస్ 1.4 లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్‌ను మారుతి సుజుకి ఉపయోగించనుంది.
మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి పవర్:
మారుతి సుజుకి ఎర్టిగా డీజిల్ వేరియంట్లో కూడా లభ్యం కానుంది. డీజిల్ వేరియంట్ ఎర్టిగాలో 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 70 కి.వా. గరిష్ట శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే డీజిల్ వేరియంట్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 66 కి.వా. గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి మైలేజ్:
మైలేజ్ విషయంలో కూడా ఎర్టిగా ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. పెట్రోల్ వేరియంట్ ఎర్టిగా లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిగా లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీనిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది. ఇది 4265 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పును, 1685 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. ఎలాంటి రోడ్లపై అయినా సుఖంగా సౌఖ్యంగా ప్రయాణించేందుకు దీని వీల్‌బేస్ 2740 మి.మీ.గా ఉండేలా కంపెనీ తీర్చిదిద్దింది.
మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ఫీచర్స్:
ఫీచర్ల విషయంలో కూడా మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఇందులో స్టయిలిష్ లుక్‌నిచ్చే 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, 3-స్పోక్ టిల్ట్ అడ్జస్టబిల్ ఎలక్ట్రిక్ స్టీరింగ్, ట్విన్ ఏసి, ఆడియో సిస్టమ్ (యూఎస్‌బి కాంపాటిబల్, 4+2 స్పీకర్స్), స్టీరింగ్‌పై ఉండే (స్టీరింగ్ మౌంటెడ్) ఆడియో కంట్రోల్స్, సెంట్రల్ డోర్ లాకింగ్ అండ్ కీలెస్ ఎంట్రీ, మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ వంటి అత్యాధునిక ఫీచర్లను మారుతి సుజుకి అందిస్తోంది.


Click it and Unblock the Notifications








