2011లో రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించిన బిఎమ్‌డబ్ల్యూ
జర్మన్ లగ్జరీ కార్ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ గడచిన సంవత్సరంలో భారీ లాభాలను నమోదు చేసుకుంది. ఇటు అమ్మకాల్లో, అటు లాభాల్లోను కంపెనీ సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంది. జనవరి 2011 నుంచి డిసెంబర్ 2011 మధ్య కాలంలో కంపెనీ నికర లాభం 4.907 మిలియన్ యూరోలు (6.5 బిలియన్ డాలర్లు)గా ఉందని బిఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. 2010 సంవత్సరంతో పోలిస్తే ఇది 51.3 శాతం ఎక్కువ.
మొత్తం వాహన అమ్మకాలు 14.2 శాతం వృద్ధిని సాధించి 16.69 లక్షల యూనిట్లకు చేరాయని, దీంతో ఆదాయం 13.8 శాతం పెరిగి 68.82 బిలియన్ యూరోలకు చేరిందని చీఫ్ నోబర్ట్ రితోఫర్ తెలిపారు. పన్నుకు ముందు ఆదాయం 52.1 శాతం పెరిగి 7.383 బిలియన్ యూరోలు నమోదు చేసింది. 2011 సంవత్సరం తమకు మర్చిపోలేనిదని, కంపెనీ చరిత్రలో 2011 తమకు ఎంతగానో గుర్తుండిపోతుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications









