భారత్‌లో 25,000 కార్ల ఉత్పత్తి మార్కును తాకిన BMW
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 25,000 కార్లను ఉత్పత్తి చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకు తమిళనాడులోని చెన్నైలో ఓ అసెంబ్లింగ్ యూనిట్ ఉంది.
విదేశాల నుంచి ఇంజన్, బాడీ, ఛాస్సిస్ మొదలైన విడిభాగాలను దిగుమతి చేసుకొని కంపెనీ తమ చెన్నై ప్లాంటులో వాటిని అసెంబ్లింగ్ చేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా 2007వ సంవత్సరంలో భారత్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. కాగా.. చెన్నై ప్లాంటులో తయారైన 25,000వ కారు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్ కావటం విశేషం.
భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అత్యధికంగా విక్రయించిన మోడళ్లలో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ క్రాసోవర్ కార్లే అధికంగా ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం దీని సరసమైన ధరే. లగ్జరీ కార్ సెగ్మెంట్లో అత్యంత చవక ధరకే లభిస్తున్న విలాసవంతమైన కారు కూడా ఇదే. దాదాపు రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షల రేంజ్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎంట్రీ లెవల్ లగ్జరీ కారును కోరుకునే వారికి ఎల్లప్పుడూ ది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.
ఈ సందర్భంగా బిఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంట్ మేనేజింగ్ డైరెక్టర్ జుర్గెన్ ఎడర్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో ఈ మైలురాయిని అధిగమించాని, ఈ విజయానికి గానూ బిఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంట్ సిబ్బందికి ప్రత్యేక ప్రశంసలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం లగ్జరీ కార్ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకు ఆడి ఇండియా నుంచి గట్టి పోటీ ఎదువరుతున్న తరుణంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్‌ను కంపెనీ వెనక్కు పిలిపించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications









