జులై 27న మార్కెట్లోకి రానున్న 2012 బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా రేపు మరో కొత్త అద్భుతాన్ని మార్కెట్‌కు పరిచయం చేయనుంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ సెడాన్‌లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను జులై 27న దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కంపెనీ విడుదల చేయనుంది.
ఎఫ్30 కోడ్ నేమ్‌తో తయారైన ఈ సరికొత్త ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్‌ను కంపెనీ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ కొత్త 3 సిరీస్ కారులో స్టయిలిష్ ఎక్స్టీరియర్స్, స్టన్నింగ్ లుక్, విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లు, అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడ లిస్టే అవుతుంది.
కొత్త 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ ఇప్పటికే విడుదైల వివిధ గ్లోబల్ మార్కెట్ల నుంచి మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న పాత 3 సిరీస్ కన్నా ఇది అన్నివిధాలా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. జులై 27న భారత మార్కెట్లోకి విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ ఆరవ తరానికి చెందినది.
ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. డీజిల్ వెర్షన్ 3 సిరీస్ (320డి)లో ఉపయోగించిన 4-సిలిండర్ ట్విన్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 235 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. డీజిల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లీటర్ డీజిల్‌కు 18.88 కి.మీ. మైలేజీనిస్తుంది.
పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ (328ఐ)లో ఉపయోగించిన ట్విన్ పవర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 245 బిహెచ్‌పిల శక్తిని, 1250 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ పెట్రోల్‌కు 14.79 కి.మీ. మైలేజీనిస్తుంది.
బిఎమ్‌డబ్ల్యూ కొత్త కారును సచిన్ టెండూల్కర్ ఆవిష్కరిస్తాడా..?
బిఎమ్‌డబ్ల్యూ ఇండియా సంస్థకు సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు పలు కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా కొత్త కారు బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌ను సచిన్ టెండూల్కర్ విడుదల చేయవచ్చని తెలుస్తోంది. కాగా.. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కవర్ చేసేందుకు డ్రైవ్‌స్పార్క్ బృందం ఇప్పటికే ముంబై బయలుదేరింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications









