డ్రైవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ
ప్రారంభంలో భాగంగా ఈ బిఎమ్‌డబ్ల్యూ డ్రైవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఢిల్లీ, చెన్నైలలో ఫిబ్రవరి నుండి మార్చి వరకూ నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ, గుర్గావ్, చెన్నైలలోని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా డీలర్లు, బిఎమ్‌డబ్ల్యూ యజమానులను, బిఎమ్‌డబ్ల్యూ డ్రైవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన భావి కొనుగోలుదారులను గుర్తిస్తారు.
బిఎమ్‌డబ్ల్యూ కస్టమర్ల డ్రైవింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా హెడ్ ఆండ్రియా స్కాఫ్ తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో అకాడెమీ అకాడెమీ వన్-డే సర్టిఫికెట్ కోర్సును అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఒక నెలలో రెండు సార్లు నిర్వహించబడుతుంది. ఈ అకాడెమీలో నిపుణులైన జర్మన్ డ్రైవర్ల ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications









