భారత్‌లో మినీ బ్రాండ్ కార్లను విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ

గడచిన జనవరిలో ఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన బిఎమ్‌డబ్ల్యూ ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ "మినీ" తన మొట్టమొదటి షోరూమ్‌ను భారత వాణిజ్య రాజధాని ముంబైలో ఏర్పాటు చేసి, నాలుగు మోడళ్లను దేశీయ విపణిలో విడుదల చేసింది. లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుని భారత మార్కెట్లో విక్రయించే ప్రముఖ డీలర్ ఇన్ఫినిటీ కార్స్ బిఎమ్‌డబ్ల్యూ మినీ బ్రాండ్‌కు ఇండియాలో అధీకృత డీలర్‌గా వ్యవహరించనుంది.

ముంబైలో సుమారు 12,500 చ.అ. విస్తీర్ణంలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్‌లో ఓ రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది. మినీ బ్రాండ్‌కు ఇండియా 100వ మార్కెట్ కావటం మరో విశేషం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 5-6 మినీ డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభిస్తామని, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, ఛండీగడ్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నామని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ తెలిపారు.

Mini Cooper Photos

Mini Convertible Photos

Mini Countryman

బిఎమ్‌డబ్ల్యూ మినీ బ్రాండ్ కార్లను సిబియూ రూట్లో (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) దిగుమతి చేసుకుని దేశీయ విపణిలో విక్రయిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో నాలుగు మినీ బ్రాండ్ కార్లు లభ్యం కానున్నాయి. వచ్చే మే నెల నాటికి మినీ కార్లు భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ దేశీయ విపణిలో అందిస్తున్న మోడళ్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* మినీ కూపర్ - రూ.25.5 లక్షలు
* మినీ కూపర్ ఎస్ - రూ.28.6 లక్షలు
* మినీ కన్వర్టిబల్ - రూ.30.7 లక్షలు
* మినీ కంట్రీమ్యాన్ - రూ.32.8 లక్షలు

More from DriveSpark

Article Published On: Friday, April 6, 2012, 10:50 [IST]
English summary
BMW owned iconic British brand Mini has inaugurated its first showroom in Mumbai on Thursday. Infinity Cars is the official distributor for Mini cars in India. BMW plans to open 5-6 exclusive Mini showrooms in the country this year including in places such as Hyderabad, Bangalore, Chandigarh and Pune.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+