అప్‌గ్రేడెడ్ 3 సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఓ గేమ్ ఛేంజర్ మోడల్‌ను భారత క్రికెట్ క్రీడా దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. భారత లగ్జరీ కార్ మార్కెట్లో దిగ్గజ కంపెనీలను సవాల్ చేస్తూ, సరికొత్త 6వ తరం (సిక్స్త్ జనరేషన్) 'బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్'ను కంపెనీ నేడు దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది.
ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో (1 పెట్రోల్, 4 డీజిల్) లభ్యమవుతుంది. భారత మార్కెట్లో లభించే 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (డీజిల్) 320డి - రూ. 28.90 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (డీజిల్) 320డి స్పోర్ట్ లైన్ - రూ. 31.50 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (డీజిల్) 320డి లగ్జరీ లైన్- రూ. 31.50 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (డీజిల్) 320డి లగ్జరీ ప్లస్ - రూ. 36.90 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (పెట్రోల్) 328ఐ స్పోర్ట్ లైన్ - రూ. 37.90 లక్షలు
భారత లగ్జరీ కార్ మార్కెట్లో సెడాన్ సెగ్మెంట్లో లభిస్తున్న తక్కువ ధర కలిగిన కార్లలో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కూడా ఒకటి. విలాసవంతమైన సౌకర్యవంతమైన ఫీచర్లతో లభించే బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ ఈ సెగ్మెంట్లోని ఆడి ఏ4 సెడాన్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ప్రస్తుతం లగ్జరీ కార్ మార్కెట్లో పోటీ గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గడచిన నెలలో ఆడి ఇండియా అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూని ఓవర్‌టేక్ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, భారత లగ్జరీ కార్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ స్థానాన్ని మరింత పటిష్టం చేయవచ్చని తెలుస్తోంది.
బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ - డీజిల్ ఇంజన్:
డీజిల్ వెర్షన్ 3 సిరీస్ (320డి)లో ఉపయోగించిన 4-సిలిండర్ ట్విన్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 235 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. డీజిల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లీటర్ డీజిల్‌కు 18.88 కి.మీ. మైలేజీనిస్తుంది.
బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ - పెట్రోల్ ఇంజన్:
పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ (328ఐ)లో ఉపయోగించిన ట్విన్ పవర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 245 బిహెచ్‌పిల శక్తిని, 1250 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ పెట్రోల్‌కు 14.79 కి.మీ. మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications









