భారత్‌లో ఆడి జోరుకు కళ్లెం వేసేందుకు బిఎమ్‌డబ్ల్యూ ప్లాన్
రెండేళ్ల క్రితం వరకూ ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన ఈ లగ్జరీ కార్లు, పెరిగిన పోటీ కారణంగా ప్రస్తుతం సరసమైన ధరలకే లభిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు తక్కువ ధర కలిగిన ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి. గత రెండేళ్లుగా బిఎమ్‌డబ్ల్యూ 'ఎక్స్1' (రూ.22.5 లక్షల నుంచి ప్రారంభం) అనే చవక కారును అందిస్తుండగా, ఆడి తాజాగా 'క్యూ3' (రూ.28.5 లక్షల నుంచి ప్రారంభం) అనే లగ్జరీ కారును అందిస్తోంది.
ఆడి కార్ల ధరలు కాస్తంత ఎక్కువైనప్పటికీ, కస్టమర్లు మాత్రం వీటినే కొనుగోలు చేసేందుకు ప్రధాన్యత ఇస్తున్నారు. జర్మన్ టెక్నాలజీ, స్టన్నింగ్ లుక్స్, స్టయిలిష్ ఇంటీరియర్స్, కంఫర్ట్ ఫీచర్స్ వంటి అనేక ప్రత్యేకతలు ఆడి కార్ల సొంతం. ప్రస్తుతం భారత మార్కెట్లో ఆడి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో లగ్జరీ కార్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.
ఈ మేరకు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా సంస్థకు సారధ్యం వహిస్తున్న ఆండ్రియాస్ స్కాఫ్‌ను కంపెనీ వెనక్కు పిలిపించి వేసింది. ఆయన స్థానంలో మరో కొత్త అధికారిని ఇండియా కోసం నియమించేందుకు బిఎమ్‌డబ్ల్యూ సన్నాహాలు చేస్తుంది. ఆండ్రియాస్ స్కాఫ్ 2010లో ఇండియన్ యూనిట్‌కు హెడ్‌గా నియమితులయ్యారు. జనవరి-జూన్ 2012 కాలంలో ఆడి మొత్తం 4000 కార్లను విక్రయించి 43 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. అయితే, ఇదే సమయంలో బిఎమ్‌డబ్ల్యూ 4457 యూనిట్లను విక్రయించి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 1 శాతం తగ్గుదలను కనబరిచింది.


Click it and Unblock the Notifications









