కేవలం 2.5 ఏళ్లలో 3 లక్షల బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 అమ్మకాలు

జర్మనీకు లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ కారు 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1' సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తక్కువ ధరకే ఆకర్షనీమైన, విలాసవంతమైన ఫీచర్లతో రూపొందించిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇది గ్లోబల్ మార్కెట్లో విడుదలైన కేవలం 2.5 ఏళ్లలోపే 3 లక్షలకు పైగా కార్లు అమ్ముడుపోయాయంటేనే ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.

ఇండియన్ మార్కెట్లో కూడా బిఎమ్‌డబ్ల్యూ నుంచి లభిస్తున్న అత్యంత చవకైన కారు ఇదే. భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 క్రాసోవర్ ధర రూ.22.5 లక్షలుగా ఉంది. ఈ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 క్రాసోవర్‌కు గట్టి పోటీగా ఇతర లగ్జరీ కార్ కంపెనీల నుంచి సరైన మోడల్ లేకపోవటమే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 సక్సెస్‌కు కారణంగా చెప్పుకోవచ్చు. సరసమైన ధరలకే లగ్జరీ కార్లను అందించాలంటే సామాన్యమైన విషయం కాదు. కానీ బిఎమ్‌డబ్ల్యూ దీనిని సాధించి చూపించింది.


అయితే, ప్రస్తుతం లగ్జరీ కార్ మార్కెట్లో పోటీ పెరుగుతోంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 క్రాసోవర్‌కు పోటీగా ఆడి నుంచి కొత్తగా ఆడి క్యూ3 కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మెర్సిడెస్ బెంజ్ కూడా ఈ మోడల్‌కు పోటీగా బి-క్లాస్ హ్యాచ్‌బ్యాక్ కార్లను వీలైనంత త్వరగా ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మార్కెట్లో విడుదలైన కొత్తల్లో అనేక విమర్శలను ఎదుర్కుంది. అయితే, ఇది ప్రస్తుతం వాటన్నింటి అధిగమించి ఈ సెగ్మెంట్లో అగ్రగామిగా నిలిచింది.

గడచిన 2009లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 క్రాసోవర్ ఎన్నో ప్రశంసలు, అనేక అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. క్రాసోవర్ క్యాటగిరీలో ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్, 2010లో న్యూ కార్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులు కూడా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 క్రాసోవర్‌ను వరించాయి. ఈ కారు ఉత్తమ నాణ్యతను కలిగి ఉండటమే కాకుండా, పెర్ఫామెన్స్, లగ్జరీ, సేఫ్టీ వంటి విషయాల్లో ఎక్కడా కూడా రాజీపడకుండా ఉండటమే ఈ మోడల్ సక్సెస్‌ కావటానికి కారణం.

More from DriveSpark

Article Published On: Tuesday, July 3, 2012, 12:24 [IST]
English summary
The highest selling car in the BMW X series, the German carmker has sold 3 lakh X1 cars all over the globe in just 2.5 years. The X1 is a five seater crossover which is the carmaker's entry level car in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+