కార్ లీజింగ్ బిజినెస్‌ను ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ

ఇప్పటికే జర్మన్ లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత్‌లో కార్ లీజింగ్ ఫైనాన్స్ ప్రారంభించగా, తాజాగా మరో జర్మన్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ కూడా కార్ లీజింగ్ ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రారంభించింది.
ఇందులో భాగంగా, బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన ఆర్థిక సేవల విభాగం, బిఎమ్‌డబ్ల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్ లీజ్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో తమ కార్లను అద్దె (లీజు) ప్రాతిపదికన వినియోగదారులకు అందిస్తామని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ తెలిపారు.
కార్పొరేట్ కస్టమర్లకే కాకుండా వ్యక్తిగత అవసరాలకు కూడా కార్లను లీజుకు ఇస్తామని ఆయన తెలిపారు. కార్లను ఇలా లీజ్‌కు తీసుకోవడం వలన కార్పోరేట్లు, హైఎండ్ ప్రొఫైల్ కలిగిన వినియోగదారులకు పన్నుల బాధ నుండి కాస్త ఉపశమనం కలిగి అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








