బిఎమ్‌డబ్ల్యూ నుండి అత్యంత వేగంగా పరుగులు పెట్టే మినీ

బిఎమ్‌డబ్ల్యూ గ్రూపు చెందిన ప్రీమియం కార్ బ్రాండ్ మినీ, గతంలో ఇది వరకెన్నడూ తయారు చేయనటువంటి, అత్యంత వేగంగా పరుగులు తీసే ఓ స్పెషల్ మినీ కారును రూపొందించింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న మినీ యునైటెడ్ ఫెస్టివల్‌లో 'మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి' అనే పేరుతో రూపొందించిన ఫాస్టెస్ట్ లిమిటెడ్ ఎడిషన్ కారును మినీ ఆవిష్కరిచింది.

ప్రస్తుతం మూడవ తరానికి చెందిన మీనీ కారు అభివృద్ధి దశలో ఉండగా, రెండవ తరానికి చెందిన మినీలో మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపి కారును బిఎమ్‌డబ్ల్యూ అభివృద్ధి చేసింది. ఈ కారును పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు. తాము తయారు చేసిన మినీ కార్లలో కెల్లా ఇదే అత్యంత వేగవంతమైనదని బిఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించిన సాంకేతిక వివరాలను మాత్రం రహస్యంగా ఉంచింది. ప్రొడక్షన్ వెర్షన్‌ను విడుదల చేసే సమయంలో దీని సాంకేతిక వివరాలను కంపెనీ వెల్లడి చేయనుంది.


మినీ జాన్ కూపర్ వర్క్స్ జిపిలో టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించామని మాత్రం బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది. ప్రస్తుతం ఉన్న మినీ జాన్ కూపర్ వర్క్స్ (జిపి లేకుండా)లో 1.6 లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 208 బిహెచ్‌పిల శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది. దీనిని బట్టి చూస్తుంటే కొత్తగా మార్కెట్లోకి రానున్న మీనీ జాన్ కూపర్ వర్క్స్ జిపి మోడల్‌లో మరింత శక్తివంతమైన ఇంజన్‌ను అమర్చినట్లుగా తెలుస్తోంది. మీనీ కార్లలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారుగా మీనీ జాన్ కూపర్ వర్క్స్ జిపి నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 16, 2012, 19:09 [IST]
English summary
German luxury carmaker BMW owned premium car brand Mini has unveiled its fastest-ever production car, the Mini John Cooper Works GP, at the Mini United festival in France.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+