ఒలంపిక్ గేమ్స్‌లో సాయం చేసేందుకు మినీ మినీ కారు

ఈ ఫోటోలో కనిపిస్తున్న బుజ్జి కారును చూడండి. ఇది బిఎమ్‌డబ్ల్యూ ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీని అనుకరిస్తూ కంపెనీ తయారు చేసిన చిన్న సైజు ఎలక్ట్రిక్ మినీ కారు. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న 2012 ఒలంపింక్ క్రీడలక్‌కు జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్య్లూ అధికారిక ఆటోమోటివ్ కార్ పార్ట్‌నర్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

ఇందులో భాగంగా, ఒలంపింక్ క్రీడా మైదానంలో ఈ బుజ్జి బుజ్జి ఎలక్ట్రిక్ కార్లు క్రీడాకారులకు సాయం చేయనున్నాయి. ఈ ఒలంపిక్ క్రీడల కోసం మొత్తం 160 బిఎమ్‌డబ్ల్యూ యాక్టివ్ఈ మోడళ్లను, 40 మినీ ఈ మోడళ్లను కంపెనీ తయారు చేసింది. ఒలంపిక్ పార్క్ మరియు పరిసర ప్రాంతాల్లోని షట్లింగ్ అథ్లెట్లు, అధికారుల కోసం ఈ చిన్న కార్లు పనులు చేసి పెట్టనున్నాయి.

అంతేకాకుండా, ఒలంపిక్ టార్చ్ ర్యాలీలో కూడా ఈ కార్లు పాల్గొంటాయి. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును కంపెనీ 'మినీ మినీ' అనే పేరుతో పిలుస్తోంది. ఇది పూర్తిగా రిమోట్ కంట్రోల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇవి ఒలంపిక్ క్రీడా మైదానంలో అథ్లెట్లు విసిరే జావలీన్స్, డిస్కసెస్, హ్యామర్స్, షాట్స్ వంటి వస్తువులను విసిరిన ప్రాంతం నుంచి తిరిగి క్రీడాకారుని వద్దకు చేరుస్తాయి.

మొత్తం మూడు మినీ మినీ కార్లను ఈ ప్రయోజనం కోసం తయారు చేశారు. ఒక్కొక్క మినీ మినీ కారు ప్రతి రోజు సుమారు 6,000 మీటర్ల రేంజ్‌ను కవర్ చేస్తాయి. ఇవి 8 కేజీల వరకూ బరువును మోయగలవు (ఒక హ్యామర్, డిస్కసెస్ లేదా షాట్ లేదా రెండు జావలీన్స్). ఇవి బ్యాటరీ పవర్ ద్వారా 35 నిమిషాల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి.

రేడియో కంట్రోల్ ద్వారా ఈ మినీ మినీ కార్లను నియంత్రిచవచ్చు. 100 మీటర్ల రేంజ్ వరకూ రిమోట్ కంట్రోల్ పనిచేస్తుంది. కేవలం 80 నుమిషాల్లో దీని బ్యాటరీలు పూర్తిగా రీఛార్జ్ అవుతాయి. ఈ మినీ మినీ కారులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 10 హెచ్‌పి శక్తిని విడుదల చేస్తుంది. ఇవి పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవి. మినీ హ్యాచ్‌బ్యాక్ ఇది 1100 మి.మీ. పొడవును, 500 మి.మీ. వెడల్పును మరియు 400 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 4, 2012, 13:03 [IST]
English summary
BMW, the official sponsor of the 2012 London Olympics has been using electric Minis as part of its promotion. It has now launched a miniature model named as the MINI mini that will be used to transport sport equipment at the athletics events.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+