రూ.5,000 లకే కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 బుకింగ్

By Ravi

మారుతి సుజుకి ఇండియా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఆల్టో 800 విడుదలకు రంగం సిద్ధమయింది. ఈనెల 16న (సెప్టెంబర్ 16, 2012) మార్కెట్లోకి విడుదల కానున్న సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారు కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం రూ.5,000ల డిపాజిట్ మొత్తానికే డీలర్లు కొత్త ఆల్టో 800 కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు.

కొత్త ఆల్టో 800 కోసం కంపెనీ ఇప్పటికే ఓ మైక్రో వెబ్‌సైట్ (http://www.marutisuzukialto800.com)ను ప్రారంభించి ఆన్‌లైన్ ద్వారా కూడా బుకింగ్‌లను స్వీకరిస్తోంది. అలాగే, కొత్త ఆల్టో 800 బుకింగ్‌లకు సంబంధించిన టెలివిజన్ కమర్షియల్‌ను కూడా కంపెనీ ప్రసారం చేస్తోంది. ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఆకర్షనీయమైన డిజైన్, అధునాతన ఇంజన్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్, మెరుగైన మైలేజ్ వంటి కీలకమైన ఫీచర్లతో కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 మార్కెట్లో సందడి చేయనుంది.


మారుతి సుజుకి ఆల్టో 800 స్పెసిఫికేషన్లు:
  • ఇంజన్ టైప్: 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్
  • గరిష్ట పవర్: 6000 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి
  • గరిష్ట టార్క్: 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్
  • ట్రాన్సిమిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
  • మైలేజ్: 22.74 కెఎమ్‌పిఎల్
  • పొడవు: 3395 మి.మీ.
  • వెడల్పు: 1490 మి.మీ.
  • ఎత్తు: 1475 మి.మీ.
  • వీల్‌బేస్: 2360 మి.మీ.
  • గ్రౌండ్ క్లియరెన్స్: 160 మి.మీ.
  • బరువు: 720 కేజీలు
  • టైర్ సైజ్: 145/80 ఆర్12 ట్యూబ్‌లెస్
  • ఫ్రంట్ సస్పెషన్: మెక్‌ఫెర్సన్స్ స్ట్రట్, గ్యాస్ ఫిల్డ్, టోర్సియన్ రోల్ కంట్రోల్
  • రియర్ సస్పెషన్: కాయిల్ స్ప్రింగ్, గ్యాస్ ఫిల్డ్, 3 లింక్ రిగిడ్ యాక్సిల్, ఐసోలేటెడ్ ట్రైలింగ్ ఆర్మ్
  • ఫ్రంట్ బ్రేక్స్: డిస్క్
  • రియర్ బ్రేక్స్: డ్రమ్
  • ఫ్యూయెల్ ట్యాంక్ సామర్ధ్యం: 35 లీటర్లు
  • అంచనా ధర: రూ.2 లక్షలు

More from DriveSpark

Article Published On: Wednesday, October 3, 2012, 13:43 [IST]
English summary
Maruti Suzuki has opened the bookings of its soon to be launched small car Alto 800. According to reports, Maruti dealers are accepting booking for new Alto 800 at just Rs 5,000. This car is expected to be launched on 16th October 2012. You can book the Alto 800 online by visiting http://www.marutisuzukialto800.com.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+