కొత్త టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ కోసం సరికొత్త క్యాంపైన్

By Ravi

Tata Safari Storme
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ బుధవారం మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త టాటా సఫారీ స్టోర్మ్ కోసం కంపెనీ ఓ వినూత్న క్యాంపైన్‌ను ప్రారంభించింది. ప్రత్యేకించి ట్విట్టర్ యూజర్ల కోసం టాటా మోటార్స్ ఈ క్యాంపైన్‌ను ప్రవేశపెట్టింది. 'బ్రేవ్ ది స్టోర్మ్' అనే పేరు ప్రారంభమైన ఈ క్యాంపైన్ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో గెలుపొందిన లక్కీ విజేతకు టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీని ఉచితంగా అందజేయటం జరుగుతుందని కంపెనీ పేర్కొంది.

ఈ క్యాంపైన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ ప్రతి రోజు టాటా మోటార్స్ అడిగే ఓ ప్రశ్నకు ఓ సరదా సమాధానాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇలా సదరు కంటెస్టెంట్ ఈ మూడు రోజుల పాటు మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి, తన ఫ్రెండ్ సర్కిల్‌లో దీనిని స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొని నెగ్గిన లక్కీ అభ్యర్థికి కొత్త టాటా సఫారీ స్టోర్మ్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ట్విట్టర్ డేటా విజువలైజేషన్ ఆధారంగా, టొరాండా రూపంలో లక్కీ విజేతను ఎన్నుకోవటం జరుగుతుంటుంది.

ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు http://www.bravethestorme.com వెబ్‌సైట్‌ను సందర్శించండి. ట్విట్టర్‌లో టాటా సఫారీ ఐడి @tata_safari

కొత్త టాటా సఫారీ స్టోర్మ్ విషయానికి వస్తే.. లగ్జరీ, కంఫర్ట్, పవర్, సుప్రీం ఆఫ్-రోడింగ్ పెర్ఫామెన్స్‌ల కలయికతో కంపెనీ ఈ ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది. ఇందులో అమర్చిన 2.2 లీటర్ వ్యారీకార్, వివిటి (వేరియబల్ టర్బైన్ టెక్నాలజీ)తో కూడిన టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌ గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త సఫారీ స్టోర్మ్ కేవలం 15 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్, టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఫోర్-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 13.2 కి.మీ. మైలేజీని, టూ-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 14 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ఇది అర్బన్ బ్రాంజ్స సార్డినియా రెడ్, పెరల్ వైట్, పెరల్ షాంపైన్, ఏస్టర్న్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, ఆర్కిటిక్ సిల్వర్ అనే ఏడు ఆకర్షనీమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా సఫారీ స్టోర్మ్ వేరియంట్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • టాటా సఫారీ స్టోర్మ్ ఎల్ఎక్స్ 4X2: రూ. 9.95 లక్షలు
  • టాటా సఫారీ స్టోర్మ్ ఈఎక్స్ 4X2: రూ. 10.77 లక్షలు
  • టాటా సఫారీ స్టోర్మ్ విఎక్స్ 4X2: రూ. 12.37 లక్షలు
  • టాటా సఫారీ స్టోర్మ్ విఎక్స్ 4X4: రూ. 13.66 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Thursday, October 18, 2012, 13:01 [IST]
English summary
With the launch of the new Tata Safari Storme, Tata Motors today launched a first of its kind campaign - 'Brave the Storme' - especially designed for Twitter users. The 3-day contest will give the lucky winner a chance to win the newly launched Tata Safari Storme.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+