బెంగుళూరులో సన్ ఫిల్ములు తొలగించడానికి జూన్ 5 వరకూ గడువు
రేపటి నుండి (మే 19, 2012 నుండి) దేశవ్యాప్తంగా వాహనాలకు సన్ ఫిల్ములను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ దేశపు అత్యున్నత న్యాయస్థానం కొత్త ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని ప్రాంతాల్లో, ఇప్పటికే సన్ ఫిల్ములను ఉపయోగిస్తున్న వాహనాలు అధిక సంఖ్యలో ఉండటంతో, ప్రజల అభ్యర్థనల మేరకు ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఈ గడువును పొడగించడం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, బెంగుళూరులోని వివిధ ప్రాంతాల్లో సన్ ఫిల్ములను తొలగించేందుకు ప్రత్యేక క్యాంప్‌లను నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు, వాహనాల తాకిడి అధికం అవుతుండటంతో పాటు ప్రజల అభ్యర్థనల మేరకు నగరంలో సంచరించే వాహనాలకు సన్ ఫిల్ములను తొలగించడానికి జూన్ 5వ తేదీ వరకూ గడువును పొడగించారు. ఈ విషయాన్ని సిటీ పోలీస్ కమిషనర్ బి.జి. జ్యోతిప్రకాశ్ మిర్జీ వెల్లడించారు.
జూన్ 5వ తేదీ తర్వాత కూడా నగరంలో ఎవరైనా సన్ ఫిల్ములను ఉపయోగిస్తున్నట్లు తెలిస్తే, మొదటి తప్పుగా రూ.300 జరిమానాను, రెండవ తప్పుగా రూ.500 జరిమానాను విధిస్తారు. మూడవసారి కూడా ఇదే తప్పును చేసినట్లయితే, ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తారు. కాగా.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రేపటి నుండి (మే 19, 2012) సన్ ఫిల్ములను పూర్తిగా నిషేధించబడుతుంది.


Click it and Unblock the Notifications








