బడ్జెట్ ఎఫెక్ట్: నిలిచిపోయిన రూ.3,000 కోట్ల పెట్టుబడులు
యూనియన్ బడ్జెట్‌లో డీజిల్ ధరల విధానంపై స్పష్టత లేని కారణంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు డీజిల్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నాయని, ఫలితంగా రూ.3,000 కోట్లకు పైగా పెట్టబడులు పెండిగ్‌లో ఉండిపోయాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు.
అయితే, ఏయే ఆటోమొబైల్ కంపెనీ ఎంత మేర పెట్టుబడులను వెచ్చించనుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో డీజిల్ ధరల పెంపు, డీజిల్ వాహనాలపై అధిక పన్నుల విధించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన విధానం ఇంత వరకూ తెలియరాలేదు. ఫలితంగా ఆటోమొబైల్ కంపెనీలు బడ్జెట్ వెలువడిన తర్వాతనే డీజిల్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టే విషయం గురించి ఆలోచించనున్నాయి.


Click it and Unblock the Notifications









