యూనియన్ బడ్జెట్ ఎఫెక్ట్: ఫిబ్రవరిలో జోరందుకున్న కార్ సేల్స్
యూనియన్ బడ్జెట్ 2012-13 విడుదల తర్వాత కార్ల ధరలు ఒక్కసారిగా పెరుగుతాయనే భయంతో గడచిన నెలలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఫిబ్రవరి 2011తో పోలిస్తే ఫిబ్రవరి 2012లో కార్ల అమ్మకాలు 13 శాతం వృద్ధిని సాధించి 1,86,890 యూనిట్ల నుండి 2,11,402 యూనిట్లకు పెరిగాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) పేర్కొంది.
అలాగే, మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లోనూ పరిశ్రమ మెరుగైన వృద్ధిని కనబరిచింది. ఫిబ్రవరి 2012లో మోటార్‌సైకిళ్ల విక్రయాలు 8.01 శాతం వృద్ధి చెంది 7,76,005 యూనిట్ల నుండి 8,38,193 యూనిట్లకు పెరిగాయి. మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలను గమనించినట్లయితే అవి 11.96 శాతం వృద్ధిని సాధించి 10.22 లక్షల యూనిట్ల నుండి 11.44 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.
ఇకపోతే వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా జోరుగానే సాగాయి. ఈ సమయంలో వాణిజ్య వాహన అమ్మకాలు 18.7 శాతం వృద్ధిని సాధించి 64,775 యూనిట్ల నుండి 76,891 యూనిట్లకు పెరిగాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహనాల విక్రయాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 12.06 శాతం వృద్ధి సాధించి 13.68 లక్షల యూనిట్ల నుండి 15.33 లక్షలకు పెరిగినట్లు ఎస్ఐఏఎమ్ తెలిపింది.


Click it and Unblock the Notifications









