పెళ్లిల్లు, పండుగ సీజన్ ఎఫెక్ట్: రాష్ట్రంలో జోరందుకున్న కార్ సేల్స్
సాధారణంగా నగరంలో సగటున రోజుకు 500-600 వాహనాలు (ద్విచక్ర, నాలుగ చక్ర వాహనాలు కలిపి) అమ్ముడవుతుంటాయి. అయితే. గడచిన కొద్ది రోజులుగా గమనిస్తే ఈ సంఖ్య సగటున 700-800 వాహనాలకు పెరిగింది. కేవలం బడ్జెట్ భయమే కాకుండా, పండుగ సీజన్, పెళ్లిల్ల సీజన్ కూడా అమ్మకాల జోరుకు కారణంగా చెప్పవచ్చు.
సగటున రోజుకు 30 కార్లు మాత్రమే విక్రయించే ఆర్‌కెఎస్ మోటార్స్, ఒక్క ఉగాది రోజునే 100 కార్లను విక్రయించింది. ప్రధానంగా పెళ్లిల్ల సీజన్ కారణంగా సాధారణంగా వచ్చే బుకింగ్‌ల కన్నా అధిక బుకింగ్‌లు వచ్చాయని, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగగలుగుతుందని అంచనా వేస్తున్నామని ఆర్‌కెఎస్ మోటార్స్ డీలర్ వినయ్ సాబూ అన్నారు.
బడ్జెట్ తర్వాత కార్ల తయారీ కంపెనీలు తమ కార్లను ధరలను రూ.3,000 మొదలుకొని రూ.3 లక్షల వరకూ పెంచనున్నాకని తెలియడంతో కొనుగోలుదారులు షోరూమ్‌ల ముందు క్యూ కట్టి బడ్జెట్ ముందు ధరలకే ఉత్పత్తులను బుక్ చేసుకోవటం వల్ల కూడా కార్ల అమ్మకాలు భారీగా పెరగడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications









