స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ విడుదల

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లను తయారు చేసే, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బుగాటి అందిస్తున్న "వేరాన్" మోడల్‌లో మరో సరికొత్త వెర్షన్‌ను దోహాలో జరుగుతున్న ఖతార్‌ మోటార్‌ షోలో ఆవిష్కరించింది. 2.05 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా) కలిగిన ఈ "స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్"ను బుగాటి ఖాతర్‌లో విడుదల చేసింది.

వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ స్టాండర్డ్ వేరియంట్ ధర 1.82 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా)గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే ఓపెన్ టాప్ కారు. సరికొత్త స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ను పూర్తిగా పసుపు, నలుపు రంగుల కలయికతో పెయింటింగ్ చేయబడి, ఇంటీరియర్స్‌లో అధిక భాగం అదే రంగులను ఉపయోగించడం జరిగింది. స్పోర్టీ లుక్ కోసం ఈ రంగులను ఉపయోగించారు.

స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్స్, ఫోటోలు

బుగాటి వేరాన్ కారు ఓ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఒక్క స్విఛ్ ప్రెస్ చేయగానే కారు రూఫ్ (పైభాగం) వెనక్కు ముడుచుకుని కన్వర్టిబిల్ కారుగా మారిపోతుంది. ఓపెన్ టాప్ మోడ్‌ (రూఫ్ తెరచి ఉంచినప్పుడు)లో ఇది గరిష్టంగా గంటకు 350 కి.మీ వేగంతోనూ, క్లోజ్డ్ టాప్ మోడ్‌ (రూఫ్ మూసి ఉంచినప్పుడు) గరిష్టంగా గంటకు 407 కి.మీ. వేగంతోనూ పరుగులు తీస్తుంది.

స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ను ఫ్రాన్స్‌లోని మోల్షియం ప్లాంటులో ఉత్పత్తి చేశారు. ఈ స్పెషల్ ఎడిషన్ కార్లను కేవలం 150 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. అందులో ఇప్పటికే 45 యూనిట్లు అమ్ముడయిపోయాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 25, 2012, 13:17 [IST]
English summary
World's fastest carmaker Bugatti has unveiled its all new special edition of Veyron 16.4 Grand Sport in Qatar Motor Show at Doha. This luxurious supercar has price at $2.05 million (excluding taxes and delivery charges).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+