10 నెలల కనిష్టానికి దిగజారిన కార్ల అమ్మకాలు
జనవరి 2009 తరువాత నెలవారీ గణాంకాల్లో భాగంగా ఇంత కోత నమోదు కావడం ఇదే తొలిసారి. గత నెలలో కార్ల ఎగుమతులు సైతం 26.83 శాతం మేర క్షీణించాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం 2008-09లో తరహాలో ఉద్దీపన ప్యాకేజీ అందించాలని, లేదంటే పరిశ్రమ స్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని సియామ్ పేర్కొంది. మొత్తమ్మీద చూస్తే, ఆగస్టు 2012 నెలలో అన్ని విభాగాల వాహనాల విక్రయాలు 3.9 శాతం క్షీణించి 13,54,436 యూనిట్లుగా నమోదయ్యాయి.
సాధారణంగా ప్రతి పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకునేందుకు కార్ మేకర్లు, డీలర్లు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తుంటారు. అయితే, ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో ఈ ఆఫర్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనికి తోడు మానేసర్ ప్లాంటు మూతపడంతో దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా గడచిన నెలలో 41 శాతం అమ్మకాలు కోల్పోవడం మొత్తం గణాంకాలపై ప్రభావం చూపిందని సియామ్ వెల్లడించింది.
గడచిన నెలలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు కూడా తగ్గు ముఖం పట్టాయి. ఆగస్టు 2012లో మోటార్‌సైకిళ్ల విక్రయాలు 8.5 శాతం క్షీణించి 7,66,127 యూనిట్లకు పడిపోయాయి. అయితే, వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం ఫర్వాలేదనిపించాయి. ఈ నెలలో వీటి అమ్మకాలు 3.9 శాతం పెరిగి 66,767 యూనిట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications









