ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలకు ఎలాంటి ఢోకా లేదు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ అమ్మకాలకు ఎలాంచి ఢోకాలేదని, యూనియన్ బడ్జెట్ 2012-13 తర్వత కార్ల ధరలు పెరగవచ్చనే భయంతో కొనుగోలుదారులు ఫిబ్రవరి నెలలోనూ, మార్చి నెల ప్రథమార్థంలోనూ జోరుగా కొనుగోళ్లు జరిపారని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) పేర్కొంది.
ఫిబ్రవరి నాటికి దేశీయ కార్ల అమ్మకాల వృద్ధి 0.31 శాతంగా ఉన్నదని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది 0-1 శాతం మధ్యలో నమోదవుతుందని ఎస్ఐఏఎమ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. ఎస్ఐఏఎమ్ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2011 నుండి ఫిబ్రవరి 2012 మధ్య కాలానికి కార్ల అమ్మకాలు 17,86,249 యూనిట్లుగా నమోదయ్యాయి.
గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 17,80,740 యూనిట్లుగా ఉన్నాయి. ఇది వరకటి అంచనాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు రుణాత్మక వృద్ధిని కనబరచవచ్చని చెప్పిన ఎస్ఐఏఎమ్, తాజా గణాంకాలను పరిశీలించిన తర్వాత తన ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications









