ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోవటం కష్టం
ప్యాసింజర్ కార్ల అమ్మకల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2011-12) గానూ నిర్ధేశించిన లక్ష్యాన్ని దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ అందుకునే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) పేర్కొంది. ఈ ఏడాది 0-2 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని కోల్పోవచ్చని సియామ్ తెలిపింది. 'ప్రస్తుత ధోరణిలోనే అమ్మకాలు సాగినట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టమ"ని సియామ్ డైరక్టర్ జనరల్ విష్ణు వ్యాఖ్యానించారు.
సియామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలంలో కార్ల అమ్మకాలు 1.19 శాతం క్షీణించి 15,74,847 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి అమ్మకాలు 15,93,850 యూనిట్లుగా ఉన్నట్లు సియామ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన రెండు నెలల్లో 10-12 శాతం మేర అమ్మకాల వృద్ధి సాధించలేకపోయినట్లయితే, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications









