ఏప్రిల్ నెలలో 3.4 శాతం వృద్ధిని సాధించిన కార్ సేల్స్

Car Sales
ఇటీవల బడ్జెట్ అనంతరం కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత బడ్జెట్‌లో కార్ల కంపెనీలపై ప్రభుత్వం ఎక్సైజ్ భారాన్ని మోపటంతో, కంపెనీలు సదరు భారాన్ని వినియోగదారులపై మోపాయి. దీంతో ఏప్రిల్ నెలలో కార్లను కొన్నివారి సంఖ్య తగ్గింది. ఏదేమైనప్పటికీ, ఏప్రిల్ నెలలో మొత్తం దేశీయ అమ్మకాలు మాత్రం ఫర్వాలేదనిపించాయి.

ఎస్ఐఏఎమ్ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2012 నెలలో భారత్‌లో కార్ల అమ్మకాలు 3.4 శాతం వృద్ధిని సాధించాయి.గడచిన నెలల్లో సాధించిన వృద్ధితో పోలిస్తే ఇది తక్కువే. మార్చి 2012లో మాత్రం అమ్మకాల వృద్ధి 20 శాతంగా నమోదైంది. ఇందుకు ప్రధాన కారణం, బడ్జెట్ తర్వాత కార్ల ధరలు పెరుగుతాయనే భయంతో కొనుగోలుదారులు ముందస్తు కొనుగోళ్లు చేయటమే.

గడచిన నెలలో మొత్తం 1,68,351 కార్లు అమ్ముడుపోయాయని భారత ఆటోమోటివ్ తయారీ దారుల సంఘం (ఎస్ఐఏఎమ్) పేర్కొంది. అలాగే, ఏప్రిల్ నెలలో ట్రక్కుల అమ్మకాలు 4.4 శాతం వృద్ధిని సాధించి 56,257 యూనిట్లు అమ్ముడు పోగా, మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 6.5 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 8,61,602 యూనిట్లుగా నమోదయ్యాయి.

More from DriveSpark

Article Published On: Thursday, May 10, 2012, 16:20 [IST]
English summary
According to the data released by the Society of Indian Automobile Manufacturers (SIAM) car sales in India rose an annual 3.4 per cent in April to 168,351 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+