జులైలో తగ్గని ఆటో జోరు: కార్లు, బైక్‌ల అమ్మకాలు భేష్
ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు 8.32 శాతం వృద్ధి చెంది 56,851 యూనిట్లుగా నమోదు కాగా, రెండవ స్థానంలో ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 7.84 శాతం వృద్ధి చెంది 27,500 యూనిట్లగానూ, ఆ తర్వాతి స్థానంలో ఉన్న టాటా మోటార్స్ అమ్మకాలు 7.53శాతం వృద్ధి చెంది 21,153 యూనిట్లగానూ నమోదయ్యాయి.
మొత్తమ్మీద గమనిస్తే.. జులై 2011తో పోల్చుకుంటే జులై 2012 నెలలో అన్ని విభాగాల్లో కలిపి వాహనాల అమ్మకాలు 7.53 శాతం వృద్ధి చెంది 13,45,644 యూనిట్ల నుంచి 14,46,959 యూనిట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7.45 శాతం వృద్ధిని సాధించి 10,54,120 యూనిట్ల నుంచి 11,32,696 యూనిట్లకు పెరిగాయి.
ఇందులో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అవి 4.98 శాతం వృద్ధి చెంది 7,82,852 యూనిట్ల నుంచి 8,21,821 యూనిట్లకు పెరిగాయి. ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా హీరో మోటోకార్ప్ అమ్మకాలు 1.03 శాతం వృద్ధి చెంది 4,36,994 యూనిట్లుగా నమోదు కాగా.. బజాజ్ ఆటో అమ్మకాలు స్వల్పంగా తగ్గి 2,00,535 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇదే సమయంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అమ్మకాలు 95.86 వృద్ధి చెంది 1,01,692 యూనిట్లుగా నమోదు కాగా, టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలు 36,461 యూనిట్లుగా నమోదయ్యి 24.18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా డీజిల్ కార్లకు డిమాండ్ జోరందుకోవటం వల్ల ఈ వృద్ధిని సాధించడం వీలైందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications









