పెట్రోల్ ధరకు కౌంటర్: చిన్న ఇంజన్లతో మెరుగైన మైలేజ్

Ford EcoSport
పెరుగుతున్న పెట్రోల్ ధరలను, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆటోమొబైల్ చిన్న ఇంజన్లను తయారు చేసే పనిలో పడ్డాయి. పెద్ద పెద్ద కార్లలో సైతం ఇప్పుడు చిన్న ఇంజన్లను ఉపయోగించటం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా అమెరికన్ కార్ మేకర్ ఫోర్డ్ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ శక్తికి సరిసమానమైన 1 లీటర్ ఇంజన్‌ను అభివృద్ధి చేసి, దానిని ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించనున్న సంగతి తెలిసిందే.

మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌లో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌నే, కంపెనీ తాజాగా విడుదల చేసిన ఎర్టిగా ఎమ్‌పివి లోనూ ఉపయోగిస్తోంది. అలాగే, టొయోటా కూడా తమ కాంపాక్ట్ సెడాన్ ఎతియోస్‌ లోనూ, ప్రీమియం సెడాన్ కరోలా లోనూ ఒకే 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇదే విధంగా ఫ్రెంచ్ కార్ మేకర్ రెనో కూడా ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్ లోనూ, హ్యాచ్‌బ్యాక్ పల్స్ లోనూ ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగిస్తుంది.

దీన్నిబట్టి చూస్తుంటే.. చవక కారులోనూ, ఖరీదైన కారులోనూ ఇంజన్‌ పరంగా పెద్దగా తేడాలేమీ మనకు కనిపించవు. "కార్లకు మైలేజ్ అతిముఖ్యమైనది. అందుకే ఫోర్డ్ ఈ సరికొత్త ఇంజన్ (1 లీటర్ ఇంజన్)ను అభివృద్ధి చేసింది. ఇది సాంప్రదాయ 1.6 లీటర్ ఇంజన్‌తో పోల్చుకుంటే మైలేజ్, పెర్ఫామెన్స్, పవర్, టార్క్‌ల పరంగా 20 శాతం మెరుగ్గా ఉంటుద"ని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ తెలిపారు.

పెద్ద ఇంజన్ల స్థానంలో టర్బోచార్జర్‌తో కూడిన చిన్న ఇంజన్లతో రీప్లేస్ చేయనున్నామని, ఇవి పెద్ద ఇంజన్ల మాదిరిగానే శక్తిని విడుదల చేస్తూ, మెరుగైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తాయని మారుతి సుజుకి మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంజనీరింగ్) ఐవి రావ్ తెలిపారు. ఎర్టిగా, డిజైర్‌లలో ఉపయోగించిన ఒక్కటే అయినప్పటికీ, ఇవి విడుదల చేసే శక్తి మాత్రం వేరుగా ఉంటుంది.

ఉదాహరణకు డిజైర్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ ఇంజన్ 75 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తే, ఎర్టిగా ఎమ్‌పివి, ఎస్ఎక్స్4 సెడాన్‌లలో ఉపయోగించిన 1.2 లీటర్ ఇంజన్ 90 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ వ్యత్యాసానికి కారణమే టర్బో పవర్. మొత్తమ్మీద కార్లలో ఇలా చిన్న ఇంజన్లను ఉపయోగించటం అనేది మైలేజ్ పెంచుకోవడానికి దారితీస్తుంది. ఫలితంగా ఇంధనం ఆదా కావడటమే కాకుండా కారు కొనుగోలు/నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 29, 2012, 15:41 [IST]
English summary
Considering the continuously rising petrol prices coupled with a focus on emission control, now car makers are coming forward with small engines that are being tweaked to deliver as much as their larger counterparts can.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+