డీజిల్ కార్లపై నో ఎక్స్‌ట్రా టాక్స్.. అయితే మాకేంటి..?

అయితే, వీరు అనుకున్నట్లుగా బడ్జెట్‌లో డీజిల్ కార్లపై అధిక సుంఖాల ప్రస్తావన రాకపోవటంతో తిరిగి డీజిల్ ఇంజన్ కార్లపై దృష్టి సారించేందుకు మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఆటోమొబైల్ దిగ్గజాలు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం బడ్జెట్ ప్రకారం గమనిస్తే, డీజిల్ టెక్నాలజీపై ధైర్యంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ రూ.5,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని ఎమ్ అండ్ ఎమ్ అధ్యక్షుడు పవన్ గోయెంకా తెలిపారు.
ఇదే బాటలో మారుతి సుజుకి, ఫోర్డ్ ఇండియా, జనరల్ మోటార్స్ ఇండియా, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియాలు కూడా పయనించనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ కార్లకు పెరుగుతున్న డిమాడును దృష్టిలో ఉంచుకొని మరిన్ని డీజిల్ వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు ఆటోమొబైల్ కంపెనీలు కసరత్తులు చేస్తున్నాయి. బడ్జెట్ భయంతో ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు రూ.3,000 కోట్ల పెట్టుబడులను పెండిగ్‌లో ఉంచాయి.


Click it and Unblock the Notifications








