సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంపై కన్నేసిన కార్నేషన్ ఆటో

భారత్‌లో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌కు మంచి పటిష్టమైన డిమాండ్ ఉందని, ఉదాహరణ సగటున 10 కొత్త కార్లు అమ్ముడవుతుంటే, 13 సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడవుతున్నాయని, ఈ సెగ్మెంట్లో సరైన కంపెనీలు లేకపోవడం వలన అవకాశాలు అపారంగా ఉన్నాయని ఆయన అన్నారు.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) లెక్కల ప్రకారం, 2010లో 18,67,246 యూనిట్లగా ఉన్న ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 2011లో 19,46,373 యూనిట్లకు పెరిగి 4.24 శాతం వృద్ధిని కనబరచాయి. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ సంవత్సరానికి 20 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నామని జగదీష్ తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న 160 అవుట్‌లెట్లలో 100కు పైగా అవుట్‌లెట్లు సర్వీసింగ్ స్టేషన్లుగానే కాకుండా, సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయకేంద్రాలుగా కూడా ఉంటాయని, వీటి ఏర్పాటు కోసం 40 కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించనున్నామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








