చార్లీ చాప్లిన్ లగ్జరీ కారు పీర్స్ యారో గురించి తెలుసా..?

చార్లీ చాప్లిన్ అసలు పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. ఈయన 1889 ఏప్రిల్ నెల 16వ తేదీన లండన్‌లో జన్మించాడు. ఈ సందర్భంగా ఆ మహా నటుడిని స్మరించుకోవటం మనందరి బాధ్యత. చార్లీ చాప్లిన్ వద్ద ఓ 1929 మోడల్ ఫీర్స్-యారో కారు ఉండేది. దీని గడచిన సంవత్సరం మే నెలలో ప్రముఖ ఇంటర్నెట్ మార్కెటింగ్ కంపెనీ ఈబే వేలానికి ఉంచింది.
అప్పట్లో ఈ డ్యూయెల్ ఫేటన్ కన్వర్టిబల్ కారు అత్యంత విలాసవంతమైన ఖరీదైన కారుగా ఉండేది. ఇందులో ఉపయోగించిన స్ట్రయిట్-8 ఇంజన్ ఆ రోజుల్లో అత్యంత సున్నితమైనది అలాగే శక్తివంతమైనది. కారు పై టాప్‌ను తొలగించినప్పటికీ, డ్రైవర్ క్యాబిన్‌తో సంబంధం లేకుండా వెనుక కూర్చున్న ప్యాసింజర్ల కోసం ఓ ప్రత్యేకమైన కంపార్ట్‌మెంట్ ఈ కారులో ఉండేది. 1929లో సుమారు 10,000 పీర్స్-యారో కార్లు అమ్ముడై ఓ రికార్డును కూడా సృష్టించాయి.
మూకీ సినిమాల యుగంలో చార్లీ చాప్లిన్ నటించిన సిటీలైఫ్, ది కిడ్ (ఛార్లీ చాప్లిన్ జీవిత కథ), సర్కస్, ది మోడ్రన్ టైమ్స్ వంటి హాస్య చిత్రాలను, టాకీ సినిమాల యుగంలో నాజీ నియంత హిట్లరును అనునయిస్తూ తీసిన 'ది గ్రేట్ డిక్టేటర్' వంటి సందేశాత్మక చిత్రాలను చాప్లిన్ నిర్మించి, దర్శకత్వం వహించారు. పసికందుల నుండి పండు ముసలి వరకూ నవ్వించ గల చార్లీ చాప్లిన్‌ను మూడు ఆస్కార్ అవార్డులు వరించాయి. 1977లో క్రిస్‌మస్ రోజున చార్లీ చాప్లిన్ తన 88వ ఏటా తుదిశ్వాస విడిచారు.


Click it and Unblock the Notifications








