బీజింగ్‌లో యాంట్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించిన చెరీ
ఈ ఫోటోలో కనిపిస్తున్న కారును చూశారా..? దీని పేరు "చీమ". అవును మీరు కరెక్ట్‌గానే చదివారు. దీనిపేరు నిజంగానే చీమ. చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ 'చెరీ' రూపొందించిన ఓ అద్భతమైన కాన్సెప్టే ఈ "ఎట్ యాంట్" (@Ant). ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా..! చీమలు గంపుగా వెళ్లేటప్పుడు ఒకదానికి వెనుక మరొకటి లైనులో వెళ్తుంటాయి కదా..! అదే సూత్రాన్ని అధారంగా చేసుకొని కాన్సెప్ట్ కారును రూపొందించారు.
ఇలాంటి ఒక్కొక్క కారును మరొక కారుతో కనెక్ట్ చేసుకుంటూ "రోడ్ ట్రైన్" మాదిరిగా మార్చుకోవచ్చు. రైలుకు భోగీలు అమర్చడం, విడగొట్టడం మాదిరిగానే ఎన్ని కార్లనైనా అమర్చుకోవచ్చు, విడగొట్టవచ్చు. ఎలక్ట్రిక్ పవర్‌తో పనిచేసే ఈ ఎట్ యాంట్ కార్లలో స్టీరింగ్ ఉండదు. దీనిని నడపటానికి డ్రైవర్ అవసరం కూడా లేదు. ఇది ఆటోమేటెడ్ టెలిమ్యాటిక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. (అంటే జిపిఎస్ మాదిరిగా అన్నమాట). ఒక్క మీరు చేరాలకున్న డెస్టినేషన్‌ను అందులో ఫిక్స్ చేస్తే చాలు. మిమ్మల్ని సురక్షింతగా గమ్యానికి చేర్చడం ఈ ఎట్ యాంట్ కారు వంతు.
ఇందులో మరో అద్భుతమైన టెక్నాలజీ ఎంటంటే.. ఈ ఎట్ యాంట్ కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు అదే రూట్లో వెళ్తున్న మరొక ఎట్ యాంట్ కారును గుర్తించి, ఇవి రెండు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకొని అటాచ్ అవుతాయి. ఒట ఎట్ యాంట్ కారు ముందు చక్రాలు మరొక ఎట్ యాంట్ కారు వెనుక చక్రాలతో కనెక్ట్ చేయబడుతాయి. ఇలా దాదాపు 10 ఎట్ యాంట్ కార్లు కెనెక్ట్ అయ్యి, పవర్‌ను షేర్ చేసుకుంటాయి. భవిష్యత్ రవాణా (ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్టేషన్) కోసం రూపొందించిన ఈ చీమల కార్ కాన్సెప్ట్ కారును చైనాలో జరుగుతున్న 2012 బీజింగ్ ఆటో షోలో చెరీ ఆవిష్కరించింది.


Click it and Unblock the Notifications









