సైలెంట్‌గా తవేరా నియో3 ని మార్కెట్లోకి విడుదల చేసిన చెవర్లే

జనరల్ మోటార్స్‌కు చెందిన బ్రాండ్ చెవర్లే చడి చప్పుడు లేకుండా సరికొత్త 'తవేరా నియో3' ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్) మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యంత పోటీటత్వపు ధరతో కంపెనీ ఈ మోడల్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. గడచిన నెలలో జరిగిన 11వ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో చెవర్లే తమ సరికొత్త తవేరా ఎమ్‌పివిని ప్రపంచానికి పరిచయం చేసింది.

కొత్త రిఫ్రెష్డ్ వేరియంట్ చెవర్లే తవేరా నియో3లో ఇంటిగ్రేటెడ్ సైడ్ ఇండికేటర్స్ కలిగిన సరికొత్త హెడ్‌లైట్స్ డిజైన్, ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లో దూసుకుపోతున్న టొయోటా ఇన్నోవాకు ధీటుగా ఉండేలా సరికొత్త తవేరా నియో3ని చెవర్లే తీర్చిదిద్దింది. దీని ఇంటీరియర్స్ మరింత సౌకర్యవంకతంగా, విశాలంగా ఉండేలా తీర్చిదిద్దారు.

For more images of Chevrolet Tavera Neo 3 please click on this link

ఇందులో డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 105 బిహెచ్‌పిల శక్తిని, 264 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఇది బిఎస్3, బిఎస్ 4 వేరియంట్లలో 6, 7, 8, 9, 10 సీటర్ ఆప్షన్‌లతో లభిస్తుంది. దూర ప్రయాణాలు (లాంగ్ ట్రిప్స్) ఎక్కువగా చేసేవారు, పెద్ద కుంటుబం (బిగ్ ఫ్యామిలీ) కలిగి ఉన్న వారికి ఇది చక్కగా సరిపోతుంది.

ఇకపోతే, దీని ధర విషయానికి వస్తే ఎంట్రీ లెవల్, 10-సీటర్ తవేరా నియో3 ధర రూ.6.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గానూ, టాప్ ఎండ్ వేరియంట్, 7-సీటర్ తవేరా నియో3 ధర 10.02 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గానూ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 7, 2012, 13:33 [IST]
English summary
Chevrolet has launched the refreshed Tavera Neo 3 with a starting price of Rs.6.72 lakhs. Available with a BS II compliant diesel engine, the Tavera gets a redesigned exterior as well as interior. It will be competing against the likes of the Innova and the Xylo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+