ఎక్కువ మైలేజ్‌నిచ్చే కొత్త చెవర్లే స్పార్క్ వస్తుందహో..!!

జనరల్ మోటార్స్‌కు చెందిన కార్ బ్రాండ్ చెవర్లే దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు 'చెవర్లే స్పార్క్'లో మరో అప్‌డేటెడ్ వేరియంట్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. చెవర్లే స్పార్క్‌ను జనరల్ మోటార్స్ అమెరికాలో చెవర్లే బీట్ పేరుతో విక్రయిస్తుంది. ఇటీవలే జనరల్ మోటార్స్ అమెరికన్ వెర్షన్ చెవర్లే బీట్ (భారత మార్కెట్లో చెవర్లే స్పార్క్)లో ఓ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న చెవర్లే స్పార్క్‌లో కూడా ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వేరియంట‌ను కంపెనీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చెవర్లే స్పార్క్ హ్యాచ్‌బ్యాక్‌ను జనరల్ మోటార్స్ తొలిసారిగా ఇండియాలో 2005లో విడుదల చేసింది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభించే ఈ బుజ్జి కారు ఒక్క మైలేజ్ విషయంలో మిగిలిన అన్ని విషయాల్లోనూ శభాష్ అనిపించుకుంటుంది.


నలుగురు ప్రయాణికులు కూర్చుని హాయిగా ప్రయాణించగలిగే ఈ కారు డ్రైవబిలిటీ, హ్యాండ్లింగ్, పెర్ఫామెన్స్, ఇంటీరియర్ స్పేస్, ఎక్స్టీరియర్ లుక్స్ విషయంలో ఈ సెగ్మెంట్లోని ఇతర కార్ల కన్నా మెరుగ్గా ఉంటుంది. కంపెనీ ప్రతిపాధించిన దాని ప్రకారం చెవర్లే స్పార్క్ లీటర్ పెట్రోల్‌కు సుమారు 14 కి.మీ. మైలేజ్‌నిస్తుంది. అయితే, వాస్తవంగా సిటీ మైలేజ్‌ను గమనిస్తే ఇది లీటరుకు 10-12 కిలోమీటర్లుగా మాత్రమే ఉంటుంది.

అందుకే, ఇందులో మరింత మెరుగైన మైలేజ్‌నిచ్చే విధంగా అప్‌గ్రేడెడ్ ఇంజన్‌ను మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా.. ఇందులో అధిక మైలేజ్ ఇచ్చేందుకు గానూ తక్కువ సీసీ కలిగిన ఇంజన్ (బహుశా 800సీసీ ఇంజన్ కావచ్చు)ను కొత్త చెవర్లే స్పార్క్‌లో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ విషయాన్ని మాత్రం జనరల్ మోటార్స్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్పార్క్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3 లక్షలకు పైమాటే. ఇదిలా ఉండగా.. ఇటీవలే చెవర్లే తవేరా ఎమ్‌పివిలో కొత్త వేరియంట్ తవేరా నియో3 బిఎస్4 వేరియంట్‌ను విడుదల చేసిన జనరల్ మోటార్స్ రానున్న రోజుల్లో కొత్త చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ, చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెయిల్ సెడాన్‌లో పాటుగా టొయోటా ఇన్నోవా, ఎర్టిగా ఎమ్‌పివిలకు ధీటుగా చెవర్లే ఎంజాయ్ అనే ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 22, 2012, 15:26 [IST]
English summary
The Spark is the entry-level car from Chevrolet which has been appreciated for its high manoeuvrability, comfort and compact size easy for city roads. But, the Spark has been lacking in the design department comparing with rivals - the Hyundai Eon and the Maruti Alto.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+