జనరల్ మోటార్స్ తర్వాతి బ్రహ్మాస్త్రం 'చెవర్లే సెయిల్'

By Ravi

జనరల్ మోటార్స్ నుంచి దేశీయ విపణిలో లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'చెవర్లే యూవీ-ఏ'ను రీప్లేస్ చేస్తూ మార్కెట్లోకి రానున్న 'చెవర్లే సెయిల్' విడుదలకు ముస్తాబవుతోంది. చెవర్లే సెయిల్ కోసం కంపెనీ ఇప్పటికే మీడియా డ్రైవ్‌ను నిర్వహించింది. జనరల్ మోటార్స్ ఈ కారును తాలేగావ్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. నవంబర్ మొదటి వారంలో చెవర్లే సెయిల్ మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ బుజ్జి కారుపై జనరల్ మోటార్స్ భారీ అంచనాలు పెట్టుకుంది.

ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించి 16 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఆశించినంత మార్కెట్ వాటాను దక్కించుకోలేక పోయిన జనరల్ మోటార్స్, కొత్తగా మార్కెట్లోకి మరిన్ని ప్రజాదరణ పొందే ఉత్పత్తులను విడుదల చేయటం ద్వారా తమ మార్కెట్ వాటాను భారీగా పెంచుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే, చైనా భాగస్వామి సాయంతో అభివృద్ధి చేసిన సరికొత్త చెవర్లే స్పార్క్ కారును సరమైన ధరకే, ఆకర్షనీయమైన ఫీచర్లతో ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది.

చెవర్లే సెయిల్ - అంచనా ధర:

చెవర్లే సెయిల్ - అంచనా ధర:

చెవర్లే సెయిల్ ధర రూ. 4.2 లక్షల నుంచి రూ. 6.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చని అంచనా.

చెవర్లే సెయిల్ - ఇంజన్:

చెవర్లే సెయిల్ - ఇంజన్:

చెవర్లే సెయిల్‌ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1199సీసీ, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 11.52 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ వెర్షన్‌లో 1248సీసీ, 4-సిలిండర్ టర్బో-డీజెల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 77 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 20.90 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
చెవర్లే సెయిల్ - కొలతలు:

చెవర్లే సెయిల్ - కొలతలు:

పొడవు: 3946 మీ.మీ.

వెడల్పు: 1690 మీ.మీ.

ఎత్తు: 1503 మీ.మీ.

వీల్ బేస్: 2465 మీ.మీ.

బూట్ స్పేస్: 248 లీటర్లు

గ్రౌండ్ క్లియరెన్స్: 174 మీ.మీ. (పెట్రోల్)/168 మీ.మీ. (డీజిల్)

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 42 లీటర్లు

చెవర్లే సెయిల్ - ఛాస్సిస్ అండ్ బాడీ:

చెవర్లే సెయిల్ - ఛాస్సిస్ అండ్ బాడీ:

నిర్మాణం: ఫైవ్-డోర్, మోనోకాక్, హ్యాచ్‌బ్యాక్

బరువు: 1065 కేజీలు (పెట్రోల్) / 1124 కేజీలు (డీజిల్)

టైర్లు: 175/70 ఆర్14

చెవర్లే సెయిల్ - సస్పెన్షన్:

చెవర్లే సెయిల్ - సస్పెన్షన్:

ఫ్రంట్ సస్పెన్షన్: ఇండిపెండెంట్, మెక్-ఫెర్సన్ స్ట్రట్స్, కాయిల్ స్ప్రింగ్, స్టెబిలైజర్ బార్

రియర్ సస్పెన్షన్: నాన్-ఇండిపెండెంట్, కాయిల్ స్ప్రింగ్

చెవర్లే సెయిల్ - స్టీరింగ్:

చెవర్లే సెయిల్ - స్టీరింగ్:

టైప్: ర్యాక్ అండ్ పినియన్

పవర్ అసిస్ట్ టైప్: హైడ్రాలిక్

చెవర్లే సెయిల్ - బ్రేక్స్:

చెవర్లే సెయిల్ - బ్రేక్స్:

ఫ్రంట్ బ్రేక్స్: వెంటిలేటెడ్ డిస్క్

రియర్ బ్రేక్స్: డ్రమ్

యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్


చెవర్లే సెయిల్‌ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1199సీసీ, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 11.52 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 1248సీసీ, 4-సిలిండర్ టర్బో-డీజెల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 77 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 20.90 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉండి, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

చెవర్లే సెయిల్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20 వంటి మోడళ్లకు గట్టి సవాల్‌గా నిలువనుంది. సెయిల్‌ హ్యాచ్‌బ్యాక్ ఇదే పేరుతో చైనా మార్కెట్లో లభిస్తోంది. అక్కడి మార్కెట్లో ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది. గతంలో ఒకానొక సందర్భంలో జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) ఎస్. సాహ్నే మాట్లాడుతూ.. మూడవ త్రైమాసికంలో సెయిల్‌ను మార్కెట్లోకి తీసుకువస్తామని, అనంతరం సెయిల్ సెడాన్‌ను, మల్టీ పర్సప్ వెహికల్ (ఎమ్‌పివి) చెవర్లే ఎంజాయ్‌ను మార్కెట్లోకి తీసుకు వస్తామని చెప్పారు.

కాగా, తాజాగా.. జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ లొవెల్ పాడ్డాక్ మాట్లాడుతూ.. చెవర్లే సెయిల్‌ను నవంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని, ప్రారంభంలో ఇది 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. డిసెంబర్ నెలలో సెయిల్ సెడాన్‌ను, ఎంజాయ్‌ ఎమ్‌పివిని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. సెయిల్, ఎంజాయ్ మోడళ్లతో భారత్‌లో తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమవుతుందని, ప్రత్యేకించి భారత మార్కెట్ స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని సెయిల్‌ను రూపొందించామని ఆయన చెప్పారు.

భారత మార్కెట్లో తయారయ్యే చెవర్లే సెయిల్‌ను కుడి చేతి డ్రైవింగ్ కలిగిన ఇతర పొరుగు మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం ఏక సంఖ్యలో ఉన్న తమ మార్కెట్ వాటాను రెండంకెలకు పెంచుకోవడమే తం ముందున్న లక్ష్యమని పాడ్డాక్ వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ కార్ల ట్రెండ్ కొనసాగుతుండటంతో కంపెనీ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని, అయితే కొత్త మోడళ్ల రాకతో ఇవి పుంజుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 9, 2012, 19:31 [IST]
English summary
General Motor's next big launch for the Indian shore, comes in the form of the Chevrolet Sail UVA hatchback. If you are looking out for a hatchback from Chevrolet, do check out the Sail UVA which will be launched next month in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+