బిఎస్ 4 చెవర్లే తవేరా నియో3ని విడుదల చేసిన జిఎమ్

చెవర్లే తవేరా నియో3లో బిఎస్ 4 వెర్షన్ విడుదల గురించి ఇదివరకటి కథనంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ప్రచురించినట్లుగానే, జనరల్ మోటార్స్ కేవలం రూ.7.51 లక్షల ప్రారంభ ధరకే బిఎస్ 4 వేరియంట్ తవేరా నియో3 ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్)ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రధానంగా మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ స్టేజ్ 4 కాలుష్య నిబంధనలు పాటించే విధంగా డిజైన్ చేసిన ఇంజన్‌ను చెవర్లే తవేరా నియో3లో ఉపయోగించటం జరిగింది.

చెవర్లే తవేరా నియో3 బిఎస్4 వెర్షన్ నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* తవేరా నియో3 బిఎస్4 - రూ.7.51 లక్షలు
* తవేరా నియో3 మ్యాక్స్ బిఎస్4 - రూ.8.73 లక్షలు
* తవేరా నియో3 ఎల్ఎస్ బిఎస్4 - రూ.9.15 లక్షలు
* తవేరా నియో3 ఎల్‌టి బిఎస్4 - రూ.10.34 లక్షలు

ఈ నాలుగు వేరియంట్లలో కూడా ఎసిఎమ్ఎల్ సోనాలికా నుండి పొందిన 2-లీటర్ కామన్ రైల్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 105 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 262 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. 15 ఇంచ్ వీల్స్, ఆకర్షనీయమైన డ్యూయెల్ కలర్ ఇంటీరియర్స్, సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, బీజ్ కలర్ సీటింగ్ వంటి మార్పులను 2012 తవేరా నియో3 బిఎస్ 4లో గమనించవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 21, 2012, 15:35 [IST]
English summary
General Motors India has launched the new Bharat Stage IV emission norms compliant variant of its multi utility vehicle (MUV) Tavera with prices starting from Rs 7.51 lakh to Rs 10.34 lakh for the top end variant (ex showroom Delhi). The upgraded Tavera has received a facelift with revamped front grille and headlamps. Chevrolet also boasts more space and comfort in the NEO3 Tavera.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+