యువతను ఆకట్టుకునేందుకు చవక లగ్జరీ కార్లు

ఆధునిక యువత కోసం చవక ధర కలిగిన విలాసవంతమైన కార్లు అందుబాటులోకి రానున్నాయి. మారుతున్న తరాలతో పాటుగానే యువతరం అభిరుచులు కూడా మారుతున్న నేపథ్యంలో, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీలన్నీ కూడా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల ధరల శ్రేణిలో ప్రత్యేకించి యువత కోసం ఇండియన్ మార్కెట్లో లగ్జరీ కార్లను ఆఫర్ చేయనున్నాయి.

ప్రస్తుతం ఈ ప్రీమియం కంపెనీలు అందిస్తున్న లగ్జరీ కార్లన్నీ కూడా రూ.30 లక్షలకు పైనే ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే తమ చిన్న కారు బి-క్లాస్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించగా, ఆడి తమ ఏ3 హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. అలాగే, బిఎమ్‌డబ్ల్యూ కూడా చవక మోడళ్లను తయారు చేసేందుకు ఓ సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. అంతేకాకుండా.. ఆడి ఏ3, మెర్సిడెస్ ఏ-క్లాస్ కార్లకు పోటీ ఇచ్చే విధంగా 2015 నాటికి ఇండియన్ మార్కెట్లో 1-సిరీస్ కార్లను కూడా ప్రవేశపెట్టాలని బిఎమ్‌డబ్ల్యూ యోచిస్తోంది.

దీన్నిబట్టి చూస్తుంటే, ఈ లగ్జరీ కార్ కంపెనీలన్నీ కూడా, అధిక జీతాలు కలిగిన యువ ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకొని చవక కార్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తమ బి-క్లాస్ స్పోర్ట్స్ టూరర్ డెలివరీలను ప్రారంభించనుండగా, 2013 మూడవ త్రైమాసికంలో ఏ-క్లాస్‌ను మార్కెట్‌లో విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 8, 2012, 12:01 [IST]
English summary
German premium carmakers BMW, Audi and Mercedes-Benz are looking to boost their sales by launching cheaper cars priced under Rs.30 lakhs. These cars are aimed at young car buyers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+