భారత్‌లో భారీ పెట్టుబడులను పెట్టనున్న కాంటినెంటల్

ఇక్కడి మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించుకునేందుకు గానూ, అలాగే రేడియల్ టైర్ల విభాగంలోకి ప్రవేశించేందుకు గానూ ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో టైర్ల ఉత్పత్తి కోసం గడచిన సంవత్సరంలో 18.5 మిలియన్‌ల యూరోల పెట్టుబడితో ఏడాది మోడీ టైర్స్‌ను కాంటినెంటల్ ఏజి టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టీవీఎస్ మోటార్‌సైకిల్స్ అందిస్తున్న అపాచీ 180 ఆర్‌టిఆర్ ఏబిఎస్ బైక్‌కు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను కాంటినెంటల్ కంపెనీయే సరఫరా చేస్తుంది. భవిష్యత్తులో తమ ఆర్ అండ్ డి వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నామని, బెంగళూరులో ఓ కొత్త కస్టమర్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








