ఎర్టిగా టీజర్‌తో కార్ ప్రియులను ఊరిస్తున్న మారుతి సుజుకి
Maruti Suzuki Ertiga At Delhi Auto Expo:
ప్యాసింజర్ కార్ల విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సంపాధించుకొని, అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా అవతరించిన మారుతి సుజుకి ఇండియా తొలిసారిగా ఈ ఎర్టిగా ఎమ్‌పివితో ఓ కొత్త ప్రయోగం చేయనుంది. మారుతి సుజుకి నుండి స్విఫ్ట్ మాదిరిగానే ఎంతో సక్సెస్ అయిన రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే ఎర్టిగా ఎమ్‌పివిని మారుతి డిజైన్ చేసింది. గురువారం మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ఆరు వేరియంట్లలో (మూడు డీజిల్ వేరియంట్లు, మూడు పెట్రోల్ వేరియంట్లు) లభ్యం కావచ్చని అంచనా.
ప్రస్తుతం ఎమ్‌పివి సెగ్మెంట్లోకి మహీంద్రా కొత్త జైలో, నిస్సాన్ ఇవాలియా, చెవర్లే ఎంజాయ్ వంటి వివిధ కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో లభిస్తున్న టొయోటా ఇన్నోవా, చెవర్లే తవేరా వంటి మోడళ్లకు మారుతి సుజుకి ఎర్టిగా పోటీగా నిలువనుంది. మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో నెక్స్ట్ జనరేషన్ కె-సిరీస్ 1.4 లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్‌ను, 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్ టర్బో డీజిల్ ఇంజన్‌లను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ 70 కి.వా. గరిష్ట శక్తిని, 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇకపోతే, డీజిల్ వేరియంట్ 66 కి.వా. గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
Maruti Suzuki Ertiga Photo Gallery:
మారుతి సుజుకి ఎర్టిగా ధర రూ.7 లక్షల నుండి రూ.9 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, 3-స్పోక్ టిల్ట్ అడ్జస్టబిల్ ఎలక్ట్రిక్ స్టీరింగ్, ట్విన్ ఏసి, ఆడియో సిస్టమ్ (యూఎస్‌బి కాంపాటిబల్, 4+2 స్పీకర్స్), స్టీరింగ్‌పై ఉండే (స్టీరింగ్ మౌంటెడ్) ఆడియో కంట్రోల్స్, మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ సౌకర్యవంతమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. అంతేకాకుండా, సెంట్రల్ డోర్ లాకింగ్ అండ్ కీలెస్ ఎంట్రీ, డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా లభించనున్నాయి. పెట్రోల్ వేరియంట్ ఎర్టిగా లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిగా లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీనిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది.


Click it and Unblock the Notifications









