బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడి మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన మన యువరాజ్ సింగ్ నేడు తన 32వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు మా డ్రైవ్‌‌స్పార్క్ బృందం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత క్రికెట్ జట్టులో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న యువరాజ్ సింగ్‌కు విలాసవంతమైన మరియు వేగంగా వెళ్లే కార్లంటే చాలా ఇష్టం. యువరాజ్ సింగ్ వద్ద ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లలో ఒకటైన లాంబోర్ఘినీ ముర్సిలాగోతో పాటుగా అనేక కార్లు తన గ్యారేజ్‌లో కొలువుదీరి ఉన్నాయి.

యువరాజ్ సింగ్ మొదటి కారు ఏంటో తెల్సా.. హోండా సిటీ! పుట్టుకతోనే ధనవంతుడైన యువరాజ్ సింగ్‌ 2000 సంవత్సరంలో ఇండియన్ క్రికెట్ జట్టులో సెలక్ట్ అయినందుకు గానూ బహుమతి తన తండ్రి యోగరాజ్ సింగ్ ఓ హోండా సిటీ కారు (2001 మోడల్)ను బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత అండర్-19 పంజాబ్ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన యువీ డర్బన్‌లో 19 సెప్టెంబర్ 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ-20 సూపర్ 8వ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు సిక్సులు కొట్టి ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు.

యువీ కొట్టిన ఆరు అద్భుతమైన సిక్సులకు గానూ బిసిసిఐ పోర్షే 911 కారుతో సత్కరించింది. బిసిసిఐ ఉపాధ్యక్షుడి చేతుల మీదుగా యువీకి ఈ కారును ప్రెజెంట్ చేశారు. ఇవే కాకుండా యువరాజ్ వద్ద మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 (దాదాపు రూ. కోటి), బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 (సుమారు రూ. 80 లక్షలు) వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఇటీవల జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ 2011లో యువీ చూపిన ఆల్-రౌండ్ ఫెర్మామెన్స్‌కు జెర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా, అప్పటి వరల్డ్ కప్ విజేత రవి శాస్త్రి చేతుల మీదుగా ఓ ఆడి క్యూ5 కారును కూడా బహుమతిగా ఇచ్చింది. మరి మన యువీ లగ్జరీ కార్ కలెక్షన్‌పై ఓ కన్నేయండి..!

బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

యువరాజ్ సింగ్ - హోండా సిటీ :

పుట్టుకతోనే ధనవంతుడైన యువరాజ్ సింగ్‌ 2000 సంవత్సరంలో ఇండియన్ క్రికెట్ జట్టులో సెలక్ట్ అయినందుకు గానూ బహుమతి తన తండ్రి యోగరాజ్ సింగ్ ఓ హోండా సిటీ కారు (2001 మోడల్)ను బహుమతిగా ఇచ్చాడు.

బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

యవరాజ్ సింగ్ - పోర్షే 911:

అండర్-19 పంజాబ్ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన యువీ డర్బన్‌లో 19 సెప్టెంబర్ 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ-20 సూపర్ 8వ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు సిక్సులు కొట్టి ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. యువీ కొట్టిన ఆరు అద్భుతమైన సిక్సులకు గానూ బిసిసిఐ పోర్షే 911 కారుతో సత్కరించింది. బిసిసిఐ ఉపాధ్యక్షుడి చేతుల మీదుగా యువీకి ఈ కారును ప్రెజెంట్ చేశారు.

MOST READ:రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

యువరాజ్ సింగ్ - బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3:

యువరాజ్ సింగ్ వద్ద సుమారు రూ. 80 లక్షలు ఖరీదు చేసే బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 కూపే కూడా ఉంది.

బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

యువరాజ్ సింగ్ - బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5:

యువరాజ్ సింగ్ వద్ద సుమారు కోటి రూపాయలు ఖరీదు చేసే బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 లగ్జరీ సెలూన్ కూడా ఉంది.

MOST READ:ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

యువరాజ్ సింగ్ - లాంబోర్గినీ ముర్సిలాగో:

యువరాజ్ సింగ్ వద్ద ఓ లాంబోర్గినీ ముర్సిలాగో (Lamborghini Murcielago) అనే సూపర్‌కారు ఉంది.

బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

లాంబోర్గినీ ముర్సిలాగోలో 6.5 లీటర్ వి-12 డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 649 బిహెచ్‌పిల శక్తిని, 67.3 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MOST READ:హోండా సిడి 110 బైక్ కొనుగోలుపై ఇప్పుడు 5000 ఆదా చేసే అవకాశం.. ఎలాగో తెలుసా ?

బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

లాంబోర్గినీ ముర్సిలాగో సూపర్ కారు కేవలం 3.8 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 340 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 100 లీటర్లు. ఇది లీటరు పెట్రోల్‌కు కేవలం 3-5 కి.మీ. మైలేజిని మాత్రమే ఇస్తుంది.

బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

ముర్సిలాగో సూపర్ కారును 2001-10 మధ్య కాలంలో లాంబోర్గినీ ఉత్పత్తి చేసేది. రెండు డోర్లు మాత్రమే కలిగి ఉండే ఈ కారులో ఇద్దరికి (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్) మాత్రమే చోటు ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ సూపర్ కారు ధర జస్ట్ రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మాత్రమే. ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే, దీనికి అధనంగా పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు కలుపుకుంటే సుమారు రూ.3 కోట్ల వరకూ ఉంటుంది.

MOST READ:డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

బర్త్ డే బాయ్ యువరాజ్ సింగ్ లగ్జరీ కార్ కలెక్షన్

యువరాజ్ సింగ్ - ఆడి క్యూ5:

క్రికెట్ ప్రపంచ కప్ 2011లో మ్యాన్ ఆఫ్ టోర్నీ అవార్డును గెలుచుకున్న యువీకి ఆడి ఇండియా 'క్యూ5' లగ్జరీ కారును కానుకగా ఇచ్చింది. మార్కెట్లో దీని ధర రూ. 40 లక్షలకు పైగా ఉంది.

యువరాజ్ సింగ్ - ఆడి క్యూ5

ఆడి ఇండియా ఛీఫ్ మైఖేల్ ప్రెస్కీ, మాజీ ఇండియన్ క్రికెటర్ రవిశాస్త్రిలు క్యూ5 కారు తాళాలను యవరాజ్ సింగ్‌కు అందించి సత్కరించారు.

Most Read Articles

English summary
Indian International cricketer Yuvraj Singh is an avid driver and enjoys driving to the core. He is a proud owner of several luxury and sports cars which include a Porsche, BMW M5 and BMW M3. The latest car to join his car collection according to reports is an Audi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X