టాటా మోటార్స్ బోర్డులో ప్రవేశించిన సైరస్ పి మిస్త్రీ
టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా సారథ్యం వహిస్తున్న ఆటోమోటివ్ విభాగం టాటా మోటార్స్ యొక్క బోర్డు లోనికి ఆయన వారసుడిగా ఎన్నికైన సైరస్ పి మిస్త్రీ ప్రవేశించారు. టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న మిస్త్రీ టాటా మోటార్స్ బోర్డులో ఓ డైరెక్టర్‌గా ఎన్నుకోబడ్డారని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
డిసెంబర్ 2012 తర్వాత రతన్ టాటా పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ గ్రూపులోని వివిధ కంపెనీలకు అధికారాన్ని సైసర్ మిస్త్రీకు అప్పగించే దశలో భాగంగా టాటా మోటార్స్ బోర్డులో ఆయనకు స్థానం కల్పించారు. 1968 జులై 4వ తేదీన జన్మించిన సైరస్ పి మిస్త్రీ యూకెలోని ఇంపీరియల్ కాలేజ్‌లోసివిల్ ఇంజనీరింగ్‌ను లండన్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో ఎమ్ఎస్‌సిని చేశారు.
గడచిన 2006 నుండి టాటా సన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేస్తున్న సైరస్ పి మిస్త్రీ నవంబర్ 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications









