భారత మార్కెట్ కోసం నిస్సాన్ చిన్న కార్ బ్రాండ్ డ్యాట్సన్
వేగంగా వృద్ధి చెందుతున్న ఇండియా, ఇండోనేషియా, రష్యా వంటి మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని, ఈ మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు డ్యాట్సన్ బ్రాండ్‌ను పునఃప్రవేశపెడుతున్నామని కంపెనీ ఉన్నతాధి ఒకరు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ మార్కెట్లు ఆటోమొబైల్ పరిశ్రమను మరింత ముందుకు తీసుకువెళ్తాయని, ఇందులో తమను లీడ్ చేసేందుకు డ్యాట్సన్ సహకరిస్తుందని ఆయన అన్నారు.
నిస్సాన్ కంపెనీకు డ్యాట్సన్ ఆటోమొబైల్ బ్రాండ్ మూడవది. భారత మార్కెట్లో డ్యాట్సన్ బ్రాండ్ పేరుతో నిస్సాన్ ప్రవేశపెట్టనున్న చిన్న కార్లు రూ.4 లక్షల కన్నా తక్కువ ధరను కలిగి ఉండనున్నాయి. 2014 సంవత్సరం నాటికి డ్యాట్సన్ కార్లు భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. డ్యాట్సన్ బ్రాండ్ కార్లు ఆధునిక స్టయిల్‌తో మంచి మైలేజ్‌ను ఇచ్చే విధంగా ఆకర్షనీయమైన డిజైన్‌ను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతినెలా 3 లక్షల డ్యాట్సన్ కార్లను విక్రయించాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత చిన్న కార్ సెగ్మెంట్లో టాటా మోటార్స్, మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి కంపెనీలు అందిస్తున్న ఎంట్రీలెవల్ కార్లకు డ్యాట్సన్ బ్రాండ్ కార్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.


Click it and Unblock the Notifications









