చెన్నైలో షోరూమ్‌ను ప్రారంభించనున్న డిసి డిజైన్స్

DC Avanti
ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా డిజైన్‌లకు ఫిదా అవని వారంటూ ఎవరూ ఉండరేమో..! తనదైన ప్రత్యేక శైలిలలో ప్రపంచ స్థాయి లుక్, ఫీచర్లతో కార్లను డిజైన్ చేయడంలో దిలీప్ ఛాబ్రియా సిద్ధహస్తుడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో దిలీప్ ఛాబ్రియా ప్రదర్శించిన మోడళ్లకు అపూర్వ స్పందన లభించింది.

ఇతను కేవలం కార్లను డిజైన్ చేయడమే కాకుండా వాటిని విక్రయించడం కూడా చేస్తుంటాడు. ఇందులో భాగంగానే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తన కంపెనీ షోరూమ్‌లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా ఓ సరికొత్త షోరూమ్ డిసి డిజైన్ కంపెనీ ప్రారంభించనుంది.

చెన్నైలోని పూన్నేమలే రోడ్డులో ఈ షోరూమ్ ఉంది. ఫిబ్రవరి 6న ఈ షోరూమ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. లలితా జువెల్లర్స్‌కు చెందిన ఆటోమోటివ్ విభాగం లలితా మోటార్స్‌తో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి డిసి డిజైన్స్ ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. 15 విభిన్న మోడళ్లను ఇక్కడ సేల్‌కు ఉంచాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ప్రస్తుతాని ఈ షోరూమ్‌లో ఓ పొడవాటి లీమో కారు ప్రదర్శనకు ఉంచబడి ఉంది. 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో డిసి డిజైన్ ప్రదర్శించిన మేడ్ ఇన్ ఇండియా సూపర్ స్పోర్ట్ కారు "అవంతి"కు ఇప్పటికే ఎనిమిది ప్రామిసింగ్ ఎంక్వైరీలు వచ్చాయి. డిసి డిజైన్స్‌కు హైదరాబాద్‌లో కూడా ఓ షోరూమ్ ఉంది. మరిన్న వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, January 19, 2012, 15:32 [IST]
English summary
Famous automotive designer Dileep Chabria's own design firm DC Design, soon will open a showroom in Chennai. The showroom will be officially inaugurated on the 6th of February, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+